For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ ను మరోమారు ప్రశంసించిన బిల్ గేట్స్.. శాస్త్రీయ ఆవిష్కరణలు, వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాలపై కితాబు

|

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు , టెక్ పయినీర్ బిల్ గేట్స్ కోవిడ్-19 మహమ్మారిని అంతం చేయడానికి భారతదేశం యొక్క టీకా-తయారీ సామర్థ్యాలను ప్రశంసించారు. శాస్త్రీయ ఆవిష్కరణలలో భారతదేశం యొక్క నాయకత్వం అద్భుతంగా ఉందని బిలియనీర్ బిల్ గేట్స్ భారతదేశ నాయకత్వాన్ని ప్రశంసించారు. భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ - 19 మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచం పనిచేస్తున్నందున , ప్రపంచంలో శాస్త్రీయ ఆవిష్కరణ మరియు టీకా తయారీ సామర్ధ్యంలో భారతదేశం ముందు వరుసలో ఉండడం చూడడం చాలా బాగుంది అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

ఆ రంగంలో భారత్ ఆదర్శం.. చైనా కాకుండా ఇప్పుడు స్టడీ చెయ్యల్సింది ఇండియానే.. బిల్ గేట్స్ కితాబుఆ రంగంలో భారత్ ఆదర్శం.. చైనా కాకుండా ఇప్పుడు స్టడీ చెయ్యల్సింది ఇండియానే.. బిల్ గేట్స్ కితాబు

భారత్ టీకా ఉత్పత్తి సామర్ధ్యాన్ని మెచ్చుకున్న బిల్ గేట్స్

భారత్ టీకా ఉత్పత్తి సామర్ధ్యాన్ని మెచ్చుకున్న బిల్ గేట్స్

బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు గతంలో భారతదేశాన్ని పలుసార్లు ప్రశంసించారు. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యలను , ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. గేట్స్ - మోడీకి రాసిన లేఖలో - భారత ప్రభుత్వం తన అసాధారణమైన డిజిటల్ సామర్థ్యాలను తన కోవిడ్-19 ప్రతిస్పందనలో పూర్తిగా ఉపయోగించుకున్నందుకు సంతోషంగా ఉందని మరియు కరోనావైరస్ ట్రాకింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం 'ఆరోగ్య సేతు' డిజిటల్ యాప్‌ను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరియు ప్రజలను ఆరోగ్య సేవలకు కనెక్ట్ చేయడం అభినందనీయమన్నారు.

 గతంలోనూ ప్రశంసలు .. చైనా కాకుండా, వారు భారతదేశం వైపు చూడాలన్న బిల్ గేట్స్

గతంలోనూ ప్రశంసలు .. చైనా కాకుండా, వారు భారతదేశం వైపు చూడాలన్న బిల్ గేట్స్

డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలపై ఆయన భారతదేశ విధానాలను కూడా బిల్ గేట్స్ ప్రశంసించారు.భారత్ లోని డిజిటల్ విధానాలు పేదలకు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం అందించిన సహాయాన్ని పంపిణీ చేసే ఖర్చు మరియు ఇబ్బందిని బాగా తగ్గించాయని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ఒక దేశాన్ని అధ్యయనం చేయబోతున్నట్లయితే, చైనా కాకుండా, వారు భారతదేశం వైపు చూడాలని నేను చెప్తాను అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

 భారత ఔషధ పరిశ్రమ ప్రపంచానికే వ్యాక్సిన్ ఉత్పత్తి చెయ్యగలదు

భారత ఔషధ పరిశ్రమ ప్రపంచానికే వ్యాక్సిన్ ఉత్పత్తి చెయ్యగలదు

కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో భారతదేశం యొక్క సహకారం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన బిల్ గేట్స్ అంతకు ముందు భారత దేశం ఔషధ పరిశ్రమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కరోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగలదు అంటూ కితాబిచ్చారు. భారతదేశంలో చాలా ముఖ్యమైన పనులు జరిగాయన్నారు . కోవిడ్- 19 వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చాలా గొప్పగా యుద్ధం చేస్తుందని ప్రశంసించారు బిల్ గేట్స్. అదే సమయంలో ఆక్స్ఫర్డ్ , కోవాక్సిన్ వ్యాక్సిన్ ల వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలపడంతో భారత వ్యాఖ్యలు తయారీ సామర్థ్యంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 టీకాలను ఉత్పత్తి చేస్తున్న పనితీరును మెచ్చుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

టీకాలను ఉత్పత్తి చేస్తున్న పనితీరును మెచ్చుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

టీకాలను ఉత్పత్తి చేస్తున్న పనితీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘేబ్రేయేసెస్ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియతో దేశ ప్రజలకు మేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు అందరం కలిసికట్టుగా పనిచేసి సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సిన్లను అవసరమైన వాళ్ళకు ఇవ్వొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి తన ట్వీట్ ను ట్యాగ్ చేశారు.

English summary

భారత్ ను మరోమారు ప్రశంసించిన బిల్ గేట్స్.. శాస్త్రీయ ఆవిష్కరణలు, వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాలపై కితాబు | Bill Gates praised India's scientific innovation and vaccine-manufacturing capabilities

Microsoft founder Bill Gates has praised India for its vaccine-manufacturing capabilities to end the COVID-19 pandemic. The billionaire philanthropist also praised India’s leadership in scientific innovation.“It’s great to see India’s leadership in scientific innovation and vaccine manufacturing capability as the world works to end the COVID-19 pandemic,” Gates tweeted.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X