For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుప్రీం తీర్పు తర్వాతే ఇండస్ టవర్‌పై భారతీ ఇన్‌ఫ్రాటెల్ నిర్ణయం

|

AGR, ఇతర బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఇబ్బందికరంగా మారింది. బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా భవితవ్యంపై అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఇది రూ.2500 కోట్ల బకాయిలు చెల్లించడంతో కొంత సానుకూల ధోరణి కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఇండస్ టవర్స్ విలీనం, ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ ఐడియాకు ఉన్న ఏడు శాతం ఈక్విటీ వాటాను భారతీ ఇన్‌ప్రాటెల్ కొనుగోలు చేస్తుందని వార్తలు వచ్చాయి.

ఎయిరిండియా బిడ్ రేసులో అదానీ గ్రూప్ ఉంటుందా?ఎయిరిండియా బిడ్ రేసులో అదానీ గ్రూప్ ఉంటుందా?

ఈ కొనుగోలుపై భారతీ ఇన్‌ఫ్రాటెల్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని క్లియరెన్స్‌లు పూర్తయినప్పటికీ ఇండస్ టవర్స్ విలీనం, వొడాఫోన్ ఐడియాకు 7% వాటా కొనుగోలు ప్రక్రియను మరో రెండు నెలలు పొడిగించనుంది. వొడాఫోన్ ఐడియాకు నగదు కొరతతో అనిశ్చితి నెలకొనడం, ఏజీఆర్‌ బకాయిలు రూ.57,000 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో వొడాఫోన్ ఐడియా మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అంచనా.

Bharti Infratel said to be hesitant on Indus Towers deal

మార్చి 17న సుప్రీం కోర్టులో AGR బకాయిలు విచారణ ఉంది. అప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి పేమెంట్స్ చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్స్ వేచి చూస్తున్నాయని చెబుతున్నారు.

English summary

సుప్రీం తీర్పు తర్వాతే ఇండస్ టవర్‌పై భారతీ ఇన్‌ఫ్రాటెల్ నిర్ణయం | Bharti Infratel said to be hesitant on Indus Towers deal

Bharti Infratel is said to be hesitant about going ahead with a plan involving a merger with Indus Towers and a buyout of 7 per cent equity stake from Vodafone Idea in the resultant entity. While almost all clearances have been obtained, the company has sought to extend the process by another two months.
Story first published: Thursday, February 27, 2020, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X