For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covaxin BBV152: భారత్‌లో పిల్లలపై ప్రయోగాలు: అమెరికాలో వ్యాక్సిన్ అమ్మకాలు: భారత్ బయోటెక్ దరఖాస్తు

|

వాషింగ్టన్: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇక అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించడం, దాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే వ్యాక్సిన్ జాబితాలో చేర్చడం వంటి పరిణామల అనంతరం భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఇక తన వ్యాపార పరిధిని విస్తరించుకోవడానికి కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగా పావులు కదుపుతోంది.

మొదట ఆస్ట్రేలియా..

మొదట ఆస్ట్రేలియా..

కొద్దిరోజుల కిందటే ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవాగ్జిన్‌ను అధికారికంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు తమ దేశానికి రాకపోకలు సాగించవచ్చని ప్రకటించింది. భారతీయులు మాత్రమే కాదు.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఏ దేశానికి చెందిన వారైనా రావచ్చని తెలిపింది. కోవాగ్జిన్‌తో పాటు చైనాకు చెందిన సినోఫామ్ అభివృద్ధి చేసిన కరోనా నిర్మూలన వ్యాక్సిన్‌ను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

అనంతరం డబ్ల్యూహెచ్ఓ..

అనంతరం డబ్ల్యూహెచ్ఓ..

ఆ తరువాత రెండు రోజుల్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ వినియోగంపై తన నిర్ణయాన్ని వెలువడించింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్)లోకి దీన్ని చేర్చింది. ఫలితంగా- ఇక ఏ దేశం కూడా ఈ వ్యాక్సిన్ వేసుకన్న ప్రయాణికులకు అడ్డు చెప్పదు. వారి రాకపోకల మీద ఎలాంటి ఆంక్షలను విధించదు. అదే రోజు- కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ తేదీ కూడా వెలువడింది. తయారు చేసిన తేదీ నుంచి 12 నెలల పాటు ఈ వ్యాక్సిన్‌ను వినియోగించుకోవచ్చని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ప్రకటించింది.

అమెరికన్ మార్కెట్‌పై

అమెరికన్ మార్కెట్‌పై

వెంటవెంటనే చోటు చేసుకున్న ఈ పరిణామాలు భారత్ బయోటెక్ యాజమాన్యానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీనితో- తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా మార్కెట్‌పై కన్నేసింది.. దృష్టి సారించింది. అమెరికాలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్న పిల్లలు, యుక్త వయస్కుల వారికి వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన అనుమతులను తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టింది.

యూఎస్ఎఫ్‌డీఏకు దరఖాస్తు..

యూఎస్ఎఫ్‌డీఏకు దరఖాస్తు..

అమెరికాలో భారత్ బయోటెక్ భాగస్వామ్య కంపెనీ అక్యుజెన్ (Ocugen) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్నపిల్లలు, టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన అనుమతులను కోరామని స్పష్టం చేసింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA)కు దరఖాస్తు దాఖలు చేసినట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులు మొదలుకుని 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు అక్యుజెన్ స్పష్టం చేసింది.

 భారత్‌లో క్లినికల్ ట్రయల్స్..

భారత్‌లో క్లినికల్ ట్రయల్స్..

వెరో సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫామ్ బేస్‌గా కోవాగ్జిన్ (BBV152)ను అభివృద్ధి చేసినట్లు అక్యుజెన్ స్పష్టం చేసింది. పోలియో వ్యాక్సిన్‌ను పోలి ఉండేలా దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. మూడోదశ పీడియాట్రిక్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డేటాను తాము ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేసినట్లు అక్యుజెన్ పేర్కొంది. భారత్‌లో రెండు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు, టీనేజర్లు 526 మందిపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు స్పష్టం చేసింది.

 నో సైడ్ ఎఫెక్ట్స్..

నో సైడ్ ఎఫెక్ట్స్..

భారత్‌లో రెండు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి మూడు గ్రూపులుగా విభజించి- ఈ ట్రయల్స్ నిర్వహించింది. 2 నుంచి ఆరు, ఆరు నుంచి 12, 12 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారకి 28 రోజుల వ్యవధితో రెండు డోసుల కోవాగ్జిన్ (బీబీవీ152) డోసులను అందజేసింది. ఈ మూడు గ్రూపుల వలంటీర్లలో ప్రాణాంతక స్ట్రెయిన్లను వ్యాక్సిన్ నిర్మూలించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఎలాంటి ప్రాణహాని కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ బయోటెెక్ భాగస్వామ్య కంపెనీ అక్యుజెన్.. యూఎస్ఎఫ్‌డీఏకు దరఖాస్తులను దాఖలు చేసింది.

English summary

Covaxin BBV152: భారత్‌లో పిల్లలపై ప్రయోగాలు: అమెరికాలో వ్యాక్సిన్ అమ్మకాలు: భారత్ బయోటెక్ దరఖాస్తు | Bharat Biotech's US partner Ocugen asked emergency use for Covaxin in US for children below 18

Bharat Biotech's US partner Ocugen announced that it had asked authorities for emergency use authorization for Covid-19 vaccine Covaxin in US, for children below 18.
Story first published: Saturday, November 6, 2021, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X