For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓ వైపు సామాన్యుల కష్టాలు: బెజోస్, జుకర్, మస్క్ సహా వారి ఆస్తులను భారీగా పెంచిన కరోనా!

|

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వ్యాపారులు, కంపెనీల ఆదాయాలు భారీగా పడిపోయాయి. అయితే అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తో సహా అమెరికాలోని బిలియనీర్ల సంపద మాత్రం భారీగా పెరిగింది. వీరి సంపద దాదాపు 10 శాతం పెరిగిందని ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ (IPS) తెలిపింది.

కరోనా భారత్‌కు సూపర్ ఛాన్స్.. ట్రంప్ గుర్తించారు, మేం 'కఠినంగానే' ఉంటాం: అమెరికాకరోనా భారత్‌కు సూపర్ ఛాన్స్.. ట్రంప్ గుర్తించారు, మేం 'కఠినంగానే' ఉంటాం: అమెరికా

ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు బిలియనీర్ల సంపద జూమ్

ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు బిలియనీర్ల సంపద జూమ్

ఓ వైపు అమెరికాలోని బిలియనీర్ల సంపద భారీగా పెరిగింది. మరోవైపు కరోనా కారణంగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయి కోట్లాది మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ సంక్షోభం చూస్తుంటే మరోవైపు జూమ్ వంటి స్టాక్స్ మార్కెట్లో ర్యాలీ చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వీడియో కాన్ఫరెన్సింగ్, రిమోట్ వర్క్ టెక్నాలజీ ఉపయోగం పెరిగింది. దీంతో జూమ్ వంటి స్టాక్స్ జుమ్మన్నాయి. దీంతో వీటిల్లోఇన్వెస్ట్ చేసిన వారి నెట్ వర్త్ పెరుగుతున్నాయి.

ఏప్రిల్ నాటికి భారీగా పెరిగిన నికర విలువ

ఏప్రిల్ నాటికి భారీగా పెరిగిన నికర విలువ

ఓ వైపు సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయి, సంస్థలు నష్టాల బాట పట్టి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కొన్ని స్టాక్స్ పెరగడం, బిలియనీర్ల సంపద పెరగడం కరోనా మహమ్మారి వెనుక భిన్న అంశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ మధ్య కాలంలో దేశంలో 34 మంది సంపన్న బిలియనీర్లు తమ నికర విలువను పదుల మిలియన్ డాలర్ల కొద్ది పెంచుకున్నారు.

జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ఆస్తులు ఎంత పెరిగాయంటే

జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ఆస్తులు ఎంత పెరిగాయంటే

జెఫ్ బెజోస్, జూమ్ వీడియో కమ్యూనికేషన్ ఫౌండర్ ఎరిక్ యాన్, ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ సహా ఎనిమిది మంది టాప్ బిలియనీర్ల సంపద పెరిగింది.

జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ స్టాక్స్ ఈ ఏడాదిలోనే 31 శాతం లాభపడ్డాయి. షట్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుండి ఆర్డర్ చేయడం పెరిగింది. దీంతో ఆన్‌లైన్ సేల్స్ పెరిగి, అమెజాన్ భారీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. జెఫ్ బెజోస్ సంపద 147.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఈ ఏడాది ప్రారంభం నుండి టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. టెస్లాలో మస్క్‌కు 18.5 శాతం వాటా ఉంది. దీంతో ఎలాన్ మస్క్ సంపద కొద్ది నెలల్లోనే 1 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఫేస్‌బుక్ కూడా భారీ లాభాలు నమోదు చేసింది. దీంతో జుకర్ బర్గ్ ఆస్తులు పెరిగాయి.

వీరి సంపద 33 లక్షల కోట్లు పెరిగింది

వీరి సంపద 33 లక్షల కోట్లు పెరిగింది

కరోనా కాలంలో అమెరికాలోని 600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత సంపాదించారు. ఈ బిలియనీర్ల మొత్తం నికర విలువ మార్చి 18-మే 19 మధ్యకాలంలో 434 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇండియన్ కరెన్సీలో రూ.రూ. 32.97 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, బెర్క్‌షైర్ ‌హాత్‌వే వారెన్ బఫెట్ కొద్ది లాభాలకు పరిమితమయ్యారు. వీరి కంపెనీలు వరుసగా 8.2%, 0.8% లాభాల్ని నమోదు చేశాయి.

English summary

ఓ వైపు సామాన్యుల కష్టాలు: బెజోస్, జుకర్, మస్క్ సహా వారి ఆస్తులను భారీగా పెంచిన కరోనా! | Bezos, Musk among US billionaires whose net worth rose

The combined wealth of America's billionaires, including Amazon.com Inc founder Jeff Bezos and Tesla Inc chief Elon Musk, increased nearly 10 per cent during the ongoing Covid-19 pandemic, according to a report published by the Institute for Policy Studies (IPS).
Story first published: Sunday, May 24, 2020, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X