For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మినిమం బ్యాలెన్స్ నుండి ఏటీఎం వరకు..: ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్, ఆగస్ట్ 1 నుండి కొత్త రూల్స్

|

బ్యాంకు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్, క్యాష్ ఉపసంహరణకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకులు ఆగస్ట్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు వసూలు చేయనున్నాయి. వచ్చే నెల నుండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మినిమం బ్యాలెన్స్ నిబంధనలు మారుతున్నాయి. వివిధ ప్రయివేటు బ్యాంకులు నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు చేస్తున్నాయి.

పాతాళానికి భారత వృద్ధి రేటు.. దాదాపు డబుల్ డిజిట్పాతాళానికి భారత వృద్ధి రేటు.. దాదాపు డబుల్ డిజిట్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మినిమం బ్యాలెన్స్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మినిమం బ్యాలెన్స్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారు అకౌంట్లలో ఇక నుండి రూ.2,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అంతకుముందు ఇది రూ.1,500గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,500 ఉండాలి. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో కొత్త రూల్స్ మేరకు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే రూ.20 నుండి రూ.75 వరకు ఛార్జీలు విధిస్తారు. మెట్రోల్లో గరిష్ట ఫైన్ రూ.75, అర్బన్ బ్రాంచీల్లో రూ.50, గ్రామీణ బ్రాంచీల్లో రూ.20 ఫైన్ విధిస్తారు. కరెంట్ అకౌంట్ హోల్డర్ యావరేజ్ బ్యాలెన్స్ రూ.5,000 ఉండాలి.

క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు

బ్యాంకుకు వెళ్లి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు ఛార్జీలు వసూలు చేయనున్నారు! తొలి 3 ట్రాన్సాక్షన్లు ఉచితం. ఆ తర్వాత ట్రాన్సాక్షన్లు మించితే డబ్బులు విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా రూ.100 వరకు క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు ఉంటుంది. అదే సమయంలో లాకర్ డిపాజిట్‌ను తగ్గించారు. అలాగే లాకర్ రెంట్ ఎరియర్స్ పెనాల్టీని పెంచింది.

యాక్సిస్ బ్యాంకు

యాక్సిస్ బ్యాంకు

యాక్సిస్ బ్యాంకు ఈసీఎస్ ట్రాన్సాక్షన్ పైన రూ.25 వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇది జీరోగా ఉంది. పరిమితిని మించితే లాకర్‌కు ఛార్జీలను ఇంట్రొడ్యూస్ చేస్తోంది. రూ.10, రూ.20, రూ.50 నోట్లపై బండిల్ (1000 నోట్లు) క్యాష్ బ్యాండ్లింగ్ ఫీజును రూ.100ను వసూలు చేయనుంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే

కొటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే

ఐదు ఉచిత డెబిట్ కార్డు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనంతరం ప్రతి లావాదేవీకి రూ.20 ఛార్జ్ చేయనుంది. క్యాష్ విత్ డ్రాయల్‌పై ఈ మొత్తం వసూలు చేస్తుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ.8.5 ఛార్జ్ చేస్తుంది. సరైన బ్యాలెన్స్ లేని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ పైన రూ.25 వసూలు చేయనుంది. యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే కొటక్ మహీంద్రా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది అకౌంట్ కేటగిరీని బట్టి ఉంది. ప్రతి నాలుగో క్యాష్ ట్రాన్సాక్షన్ పైన రూ.100 ఛార్జీ వసూలు చేస్తుంది.

English summary

మినిమం బ్యాలెన్స్ నుండి ఏటీఎం వరకు..: ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్, ఆగస్ట్ 1 నుండి కొత్త రూల్స్ | Banks to increase cash handling charges from August 1

Bank of Maharashtra, Axis Bank, Koatk Mahindra Bank and RBL bank have imposed charges for cash withdrawal or increased minimum balance requirements effective August 1.
Story first published: Sunday, July 19, 2020, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X