కరోనా మహమ్మారి కష్టకాలంలో చాలా మంది మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి బంగారంపై రుణాల కోసం బ్యాంకుల బాట పడుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో గతంతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఈ కొత్త సంవత్సరంలో కూడా బ్యాంకుల వడ్డీ రేట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వడ్డీ రేట్లు కూడా తగ్గినట్లుగా తెలుస్తోంది. బంగారం కూడా ధర విపరీతంగా పెరగడంతో బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా బంగారం ధరను బట్టి ఉన్నాయి .

గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 నుండి 13 శాతం వరకు
ఇక ఈ ఏడాది బంగారం కుదువ పెట్టి తీసుకునే వారికి వివిధ బ్యాంకుల్లో ఉన్న వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ లతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11 శాతం నుండి 24 శాతం వరకు ఉండగా, కస్టమర్ ప్రొఫైల్ బట్టి వడ్డీ రేటు కూడా మారుతుండటం జరుగుతుంది. ఇక గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు కూడా అంతే, 2021 జనవరి నాటి లెక్కల ప్రకారం చూస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 నుండి 13 శాతం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

బ్యాంకుల వారీగా గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు వివరాల జాబితా
బ్యాంకుల వారీగా గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు వివరాల జాబితా చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7%, బ్యాంకు 7.65 శాతం వడ్డీ రేటుకు బంగారు రుణాలను అందిస్తున్నాయి. ఇక కర్ణాటక బ్యాంక్ 8.3 8శాతం, ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యూకో బ్యాంక్ 8.50 శాతం గా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.75 శాతం వడ్డీ రేటు గోల్డ్ లోన్ ఇస్తుండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85 శాతం వడ్డీ రేటుతో బంగారంపై రుణాలను అందిస్తోంది
.

ప్రైవేటు బ్యాంకుల్లో , ఫైనాన్స్ సంస్థల్లో వడ్డీ రేట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.05 శాతం రేటుకు గోల్డ్ లోన్ ఇస్తుంది. ప్రైవేటు బ్యాంకులు విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు 9.90 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 10%, ఇండస్ బ్యాంకు 10%, బ్యాంకు 10.99 శాతం, ఐ ఐ ఎఫ్ ఎల్ ఫైనాన్స్ 9.2 4%, బజాజ్ ఫిన్ సర్వీస్ 11 శాతం, ముత్తూట్ ఫైనాన్స్ 11.99 శాతం, మణప్పురం ఫైనాన్స్ 12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 13% వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్ అందిస్తోంది.

అతి తక్కువ వడ్డీ రేటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో
అందరి కంటే తక్కువ వడ్డీ రేట్ ను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇస్తుండగా, అందరి కంటే ఎక్కువ వడ్డీ రేటు యాక్సిస్ బ్యాంక్ లో ఉంది. ఈ వడ్డీరేట్ల ఆధారంగా వడ్డీ రేటు తక్కువగా ఉన్న బ్యాంకు ని ఎంచుకొని గోల్డ్ లోన్ తీసుకుంటే అదనపు వడ్డీ భారాన్ని తగ్గించుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఏదేమైనా కరోనా కష్టకాలంలో బ్యాంకులో బంగారంపై రుణాలకు వడ్డీ రేటు తక్కువగా ఉండటం మధ్య తరగతి, సామాన్య ప్రజలకు నిజంగా ఊరట కలిగించే అంశం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications