For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

interest rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి!

|

interest rates: ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రజలు సురక్షితంగా డబ్బు దాచుకునే ప్రదేశాల్లో బ్యాంకులు ముందు వరుసలో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి తక్కువ వడ్డీ రేటు కారణంగా.. పోస్ట్ ఆఫీస్ పథకాలు, గవర్నమెంట్ బాండ్లు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు.. తాజాగా పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం.

 పంజాబ్ & సింధు బ్యాంకు టాప్:

పంజాబ్ & సింధు బ్యాంకు టాప్:

ఇప్పటివరకు తక్కువ వడ్డీ ఇస్తూ డిపాజిట్లు రాబట్టడానికి ప్రయత్నించి, బ్యాంకులు విఫలమయ్యాయి. కాబట్టి ఇకపై ద్రవ్యోల్భణాన్ని మించిన స్థాయిలో తప్పక పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కొన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటుని 8 శాతానికి పైగా పెంచాయి. ప్రభుత్వ అధీనంలోని పంజాబ్ & సింధు బ్యాంకు 8-8.50 శాతం ఆఫర్ చేస్తూ అగ్రస్థానంలో ఉంది. కాగా దాదాపు అన్ని ఇతర బ్యాంకులు 7 శాతం పైగానే అందిస్తున్నాయి.

అన్నీ 7 శాతానికి పైగానే..

అన్నీ 7 శాతానికి పైగానే..

200 నుంచి 800 రోజుల వ్యవధికి సంబంధించిన డిపాజిట్లపై ప్రస్తుత ద్రవ్యోల్భణ రేటుకు పైగా బ్యాంకులు ప్రస్తుతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సమీకరణతో పోలిస్తే రుణాల్లో వృద్ధి ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడు వడ్డీ రేట్ల పెంపు ద్వారా ప్రస్తుతం ఏర్పడిన నిధుల కొరత నుంచి బయటపడాలని బ్యాంకులు భావిస్తున్నాయి. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్భణం 6.52 శాతానికి పెరిగింది. ఇప్పుడు డిపాజిట్లపై కనీసం 7 శాతం రేటు ఇస్తే వినియోగదారులకు సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి.

 ప్రభుత్వరంగ బ్యాంకుల రేట్లు ఇలా..

ప్రభుత్వరంగ బ్యాంకుల రేట్లు ఇలా..

పంజాబ్ & సింధ్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 221 రోజులకు గాను సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 8 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. తరువాతి స్థానంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులకు 7.35 శాతం అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు SBI.. 400 రోజుల డిపాజిట్లపై 7.10, ఇక 800 రోజులకు యూనియన్ బ్యాంక్ 7.30, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 666 రోజులకు 7.25, 399 రోజులకు బ్యాంక్ ఆఫ్ బరోడా 7.05, 444 రోజులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజులకు 7 శాతం, కెనరా బ్యాంక్ 400 రోజులకు 7.15, 555 రోజులకు ఇండియన్ బ్యాంక్ 7 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు అన్ని బ్యాంకుల రేట్లపై అదనంగా 0.50 శాతం ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి.

 ఇవీ ప్రైవేటు బ్యాంకుల రేట్లు:

ఇవీ ప్రైవేటు బ్యాంకుల రేట్లు:

అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఇస్తోంది. అయితే ఐదేళ్లు దాటిన డిపాజిట్లపై మాత్రమే ఈ అవకాశం అందిస్తోంది. మరో దిగ్గజ బ్యాంకు ICICI మాత్రం 15 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7 శాతం ఇస్తూ, సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అధికంగా ముట్టజెపుతోంది.

English summary

interest rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి! | Banks hike interest rates on fixed deposites to offer minimum 7 pa

Banks increased interest rates
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X