For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేదోడికి రూపాయి నమ్మని బ్యాంకులు.. ఉన్నోడికి రూ. 10,09,511 కోట్లు మాపీ చేశాయి..

|

గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులు 10,09,511 కోట్ల రూపాయల మొండి బకాయిలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. "బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను క్లీయర్ చేయడానికి, పన్ను ప్రయోజనాలను పొందేందుకు, మూలధనాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, వారి బోర్డులచే ఆమోదించిన RBI మార్గదర్శకాలు, పాలసీకి అనుగుణంగా వారి సాధారణ వ్యాయామంలో భాగంగా NPAలను రద్దు చేస్తాయి. RBI, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (SCBలు) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొత్తాన్ని రద్దు చేసింది" నిర్మలా సీతారామన్ తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్‌బీఐనే రూ.1,64,735 కోట్ల రుణాలు రద్దు చేసింది. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.61,763 కోట్ల రద్దుతో రెండో స్థానంలో ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.59,807 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.52,655 కోట్లు మాఫీ చేసింది.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ రూ.37,617 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.34,281 కోట్లు, ఐడీబీఐ రూ.32,586 కోట్లు, యూకో బ్యాంక్ రూ.30,160 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.22,522 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.21,772 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.18,874 కోట్ల రుణాలను రద్దు చేసిన నిర్మలా సీతారామాన్ తెలిపారు. ప్రస్తుతం, కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని చిన్న స్థాయిలో ఉపయోగిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తెలియజేసినట్లు మంత్రి చెప్పారు.

ఎన్‌పీఏలు

ఎన్‌పీఏలు

ఎన్‌పీఏలకు బ్యాంకు అధికారులే కారణమని వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్‌ చేస్తాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి చెప్పారు. రుణాలు రైటాఫ్‌ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని వివరించారు.

ప్రభుత్వ బ్యాంకులు

ప్రభుత్వ బ్యాంకులు

పేదోడికి రూపాయి నమ్మని బ్యాంకులు కార్పొరేట్ సంస్థల లక్షల కోట్లు మాఫీ చేయడంపై మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రుణాలు రద్దు చేసిన బ్యాంకుల్లో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి.

English summary

పేదోడికి రూపాయి నమ్మని బ్యాంకులు.. ఉన్నోడికి రూ. 10,09,511 కోట్లు మాపీ చేశాయి.. | Banks have written off bad loans worth Rs 10,09,511 crore in the last five years

Finance Minister Nirmala Sitharaman told Parliament on Tuesday that banks have written off bad loans worth Rs 10,09,511 crore in the last five years.
Story first published: Wednesday, December 14, 2022, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X