For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు సమ్మె: ఆదివారం to ఆదివారం, 6 రోజులు బ్యాంకులు క్లోజ్!

|

మార్చి రెండోవారంలో బ్యాంకుల వరుసగా ఆరు రోజుల పాటు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శాలరీ పెంపు కోసం మార్చి 11వ తేదీ నుండి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) పిలుపునిచ్చాయి. ఈ ఫిబ్రవరి నెలలో శివరాత్రి నుండి వరుసగా మూడు రోజులు వచ్చాయి. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం, శనివారం నాలుగో శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో 21, 22, 23 తేదీల్లో బ్యాంకులు మూతబడ్డాయి. వచ్చే నెలలో సమ్మె కారణంగా మార్చి రెండో వారంలో బ్యాంకులు 6 రోజులు బంద్ కానున్నాయి.

నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే పథకం... వచ్చే నెలలో క్లోజ్ అవుతోంది. చేరారా లేదా?నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే పథకం... వచ్చే నెలలో క్లోజ్ అవుతోంది. చేరారా లేదా?

ఉద్యోగులు 20 శాతం.. యాజమాన్యం 12.5 శాతం

ఉద్యోగులు 20 శాతం.. యాజమాన్యం 12.5 శాతం

వేతన పెంపు కోసం మార్చి 11వ తేదీ నుండి 13వ తేదీ మధ్యలో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని BEFI, AIBEA సహా వివిధ బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకు సంఘాలు 20 శాతం వేతన పెంపును కోరుతున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ (IBA) చొరవతో జరిపిన చర్చల్లో బ్యాంకు యాజమాన్యాలు 12.5 శాతానికి సుముఖత వ్యక్తం చేశాయి. దీనికి సంఘాలు అంగీకరించలేదు.

డిమాండ్లలో ఇదీ..

డిమాండ్లలో ఇదీ..

యూనియన్ల ప్రధాన డిమాండ్లలో వేతన సవరణతో పాటు 5 డే వర్కింగ్ డే ఉంది. దేశంలో పబ్లిక్ హాలీడేలు ఎక్కువగా ఉండటంతో వారానికి ఐదు రోజుల పని దినాలు సాధ్యం కాదని IBA చెబుతోంది. ప్రతి శని, ఆదివారాలు బ్యాంకులు మూతబడితే ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని అంటోంది.

ఒకేరోజు పని చేస్తాయి కాబట్టి

ఒకేరోజు పని చేస్తాయి కాబట్టి

పెన్షన్ స్కీం తొలగింపు, ఫ్యామిలీ పెన్షన్ ఇంప్రూమెంట్, బేసిక్ వేతనంలో స్పెషల్ అలవెన్స్ మెర్జ్ చేయడం వంటి ఇతర డిమాండ్లూ ఉన్నాయి. సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయకపోవచ్చు. ఆ సమయంలో ఏమైనా పనులు ఉంటే ముందే పూర్తి చేసుకోవాలి. వారంలో ఒకేరోజు బ్యాంకులు పని చేస్తాయి కాబట్టి ఏటీఎంలపై ప్రభావం పడే అవకాశముంది. సమ్మె ప్రభావం ప్రయివేటు బ్యాంకులైన HDFC, ICICI వంటి వాటిపై ఉండదు. ఈ బ్యాంకుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ఆదివారం నుండి ఆదివారం వరకు..

ఆదివారం నుండి ఆదివారం వరకు..

సమ్మె ఉంటే మార్చి 11 నుండి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉంటుంది. అంటే బుధ, గురు, శుక్రవారాలు సమ్మె బ్యాంకులు పని చేయవు. అంతకుముందు, 8వ తేదీ ఆదివారం. 9వ తేదీ సోమవారం బ్యాంకులు పని చేస్తాయి. మరుసటి రోజు అంటే 10వ తేదీ హోలీ పర్వదినం సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత 14వ తేదీ రెండో శనివారం. 15వ తేదీ ఆదివారం. అంటే వరుసగా ఈ రెండు రోజులు కూడా సెలవు. అంటే మార్చి 8 ఆదివారం నుండి 15 వరకు బ్యాంకులు కేవలం ఒకేరోజు (సోమవారం) పని చేస్తాయి. మార్చి రెండో వారాన్ని అనుకుంటే 10 నుండి 15 మధ్య బ్యాంకులు పని చేయకపోవచ్చు

మార్చి 5న తేలనుంది..

మార్చి 5న తేలనుంది..

అయితే సమ్మె విషయం ఇంకా ఖరారు కాలేదు. మార్చి 5వ తేదీన కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద జరిగే చర్చల్లో ఇది ఖరారు అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు గత నెల జనవరి 8-9, జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన సమ్మె చేసిన విషయం తెలిసిందే.

English summary

బ్యాంకు సమ్మె: ఆదివారం to ఆదివారం, 6 రోజులు బ్యాంకులు క్లోజ్! | banks are closed for three days, more pain awaits next month

All public sector and private banks will remain closed for three days, starting Friday. Notably, next month banks have called for a three-day strike from March 11-13 that falls on Wednesday, Thursday and Friday.
Story first published: Sunday, February 23, 2020, 7:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X