For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఇవే..

|

సెప్టెంబర్ నెలలో బ్యాంకులతో పని ఉందా? అయితే ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసుకోవడం అవసరం. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు 12 రోజుల వరకు పని చేయవు. ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లే వారు ఏయో రోజులు బ్యాంకులు పని చేస్తాయో తెలుసుకొని, ఆ మేరకు ప్రణాళికలు వేసుకోవాలి. లేదంటే కాస్త ఇబ్బందిపడవలసి వస్తుంది. సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు పన్నెండు రోజులు సెలవులు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు ఏడు రోజులు క్లోజ్ అవుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో 5వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీ, 26వ తేదీ ఆదివారాలు వస్తున్నాయి. 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు దినం. ఈ ఆరు రోజులతో పాటు సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా బ్యాంకులు పని చేయవు. 10వ తేదీతో పాటు 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతున్నాయి.

Bank Holidays: Banks to be Shut for 12 Days in September

సెప్టెంబర్ 8వ తేదీన గౌహతిలో బ్యాంకులు పని చేయవు. ఇక్కడ శ్రీమంత శంకరదేవ తిథి నేపథ్యంలో బ్యాంకులు పని చేయవు. సెప్టెంబర్ 9న గ్యాంగ్‌టక్‌లో తీజ్(హరితలిక) సందర్భంగా బ్యాంకులు పని చేయవు. సెప్టెంబర్ 10న అగర్తాలా, ఐజ్వాల్, భోపాల్, చండీగడ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంపాల్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోచ్చి, కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం మినహా మిగతా చోట్ల బ్యాంకులు కోల్జ్ అవుతాయి. సెప్టెంబర్ 17న రాంచీలో, సెప్టెంబర్ 20న గ్యాంగ్‌టక్(ఇంద్రజాతర సందర్భంగా), సెప్టెంబర్ 21న కొచ్చి, తిరువనంతపురం (నారాయణ గురు సమాధి డే సందర్భంగా) సెలవులు ఉంటాయి.

English summary

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఇవే.. | Bank Holidays: Banks to be Shut for 12 Days in September

Keeping track of bank holidays is necessary to ensure an uninterrupted flow of finances and banking functions in personal, professional, business and social lives.
Story first published: Tuesday, August 31, 2021, 9:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X