రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలలో బ్యాంకు హాలీడేస్‌ను ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటనలో దేశంలో ఆయా ప్రాంతాల వారీగా డిసెంబర్ నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. సాధారణంగా బ్యాంకులకు ఆదివారం సెలవుదినం. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవన్నీ కలిపి డిసెంబర్ నెలలో పన్నెండు రోజులు బ్యాంకులు పని చేయడం లేదు. ఇందులో ఆరు సాధారణ సెలవులు, మిగతా 6 ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆరు రోజులు సాధారణ సెలవులు ఉన్నాయి.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలీడేస్ జాబితా
డిసెంబర్ 3: Feast of St. Francis Xavier - Goa
డిసెంబర్ 18: Death Anniversary of U SoSo Tham - Shillong
డిసెంబర్ 24: Christmas Festival (Christmas Eve) - Aizawl, Shillong
డిసెంబర్ 25: Christmas - Guwahati, Hyderabad, Imphal, Jaipur, Jammu, Kanpur, Kochi, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Panaji, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, Srinagar, Thiruvananthapuram

డిసెంబర్ 27: Christmas Celebration - Aizawl
డిసెంబర్ 30: U Kiang Nangbah - Shillong
డిసెంబర్ 31: New Year's Eve - Aizawl
వారాంతపు సెలవులు
డిసెంబర్ 5: Sunday
డిసెంబర్ 11: Second Saturday of the month
డిసెంబర్ 12: Sunday
డిసెంబర్ 19: Sunday
డిసెంబర్ 25: Fourth Saturday of the month and Christmas
డిసెంబర్ 26: Sunday


Click it and Unblock the Notifications