For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bangalore: చెత్త రికార్డు నమోదు చేసిన బెంగళూరు.. ప్రపంచంలోనే అందులో రెండో స్థానం !!

|

Bangalore: నగరాల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పెరిగిపోతోంది. సిటీలోని మంచి బిజినెస్ ఏరియాలో అయితే పరిస్థితి మరింత దారుణం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యే ఇది. దీనిపై అధ్యయనం చేసిన టామ్ టామ్ ఆనే సంస్థ ఓ షాకింగ్ నివేదికను విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటున్న వాటిలో ఓ భారతీయ నగరం ఏకంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండటం ఆశ్చర్యం గొలపక మానదు.

10 కి.మీ వెళ్లాలంటే అరగంట:

10 కి.మీ వెళ్లాలంటే అరగంట:

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా డ్రైవ్ చేయడంలో బెంగళూరు సిటీ సెంటర్, గతేడాది రెండవదిగా నిలిచినట్లు టామ్ టామ్ బుధవారం నివేదించింది. అక్కడ రోడ్డు మీద 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 29 నిమిషాల 9 సెకన్లు పట్టినట్లు వెల్లడించింది. అయితే 30 నిమిషాల 20 సెకన్లతో లండన్ మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్, జపాన్‌ కు చెందిన సపోరో, ఇటలీలోని మిలాన్‌ లు ఆ తరువాతి స్థానాన్ని ఆక్రమించినట్లు ప్రకటించింది.

పరిగణలోకి తీసుకున్న అంశాలివీ:

పరిగణలోకి తీసుకున్న అంశాలివీ:

టామ్‌ టామ్ వార్షిక ట్రాఫిక్ ఇండెక్స్ 12వ ఎడిషన్ లో భాగంగా, 56 దేశాల్లోని 389 నగరాల్లో ట్రాఫిక్ ట్రెండ్‌ ల మీద ఆ సంస్థ అధ్యయనం చేసింది. 2022లో ప్రతి నగరంలోని ట్రాఫిక్‌ పై సమయం, డబ్బు సహా డ్రైవింగ్ ఖర్చును, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసింది. ఇందుకోసం మైలు దూరం ప్రయాణానికి పట్టే సమయం, ధర, CO2 ఉద్గారాలను లెక్కగట్టింది. పెట్రోల్, డీజిల్, EV కార్లలో నగరంలో 10 కి.మీ వెళ్లేందుకు వెచ్చించే సమయాన్ని పరిగణలోనికి తీసుకుంది.

వీటిలోనూ టాప్ 5 లో బెంగళూరు:

వీటిలోనూ టాప్ 5 లో బెంగళూరు:

సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు, రిమోట్‌ గా పని చేసే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ సిటీల్లో ట్రాఫిక్ వల్ల పెద్ద మొత్తంలో సమయం వృథా అవుతోందని నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో 129 గంటలతో బెంగళూరు నాల్గవ స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. గతేడాది ఈ సమయం బాగా పెరిగిందని చెప్పింది. రద్దీ వేళ CO2 ఉద్గారాల విషయం తీసుకుంటే లండన్ అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు ఐదవ స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది.

ప్రణాళిక లేమి, అధికారుల అత్యుత్సాహం:

ప్రణాళిక లేమి, అధికారుల అత్యుత్సాహం:

నిర్మాణాల విషయంలో ప్రణాళిక లేమి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పేరిట రవాణా శాఖ జోక్యం వల్ల.. బెంగళూరులో రద్దీ విపరీతంగా పెరిగినట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి చెందిన మొబిలిటీ నిపుణులు ప్రొఫెసర్ ఆశిష్ వర్మ అభిప్రాయపడ్డారు. దీనిని నివారించేందుకు మంచి రహదారులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కర్ణాటక ప్రభుత్వ సలహాదారు, స్మార్ట్ సిటీస్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ ఎంఎన్ శ్రీహరి తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

"దురదృష్టవశాత్తు బెంగళూరులో రోడ్లు చాలా ఇరుకైనవి. ఇంటి వద్ద ఉంచాల్సిన వాహనాలను ప్రజలు రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనిని నివారించినట్లయితే ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడుతుంది. రహదారి-ట్రాఫిక్ కోసం, ఫుట్ పాత్‌ లు-పాదచారుల కోసం ఉద్దేశించినవి అని ప్రజలు గుర్తించాలి" అని శ్రీహరి పేర్కొన్నారు. అయితే టామ్ టామ్, ఇన్రిక్స్ పేర్కొన్న రద్దీ ర్యాంకింగ్‌ లు లోపభూయిష్టంగా ఉన్నాయని బెంగళూరు పౌరుల అజెండా కన్వీనర్ సందీప్ అనిరుధన్ తెలిపారు. లండన్‌ లో అధిక రద్దీ ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు.

Read more about: traffic bengaluru london
English summary

Bangalore: చెత్త రికార్డు నమోదు చేసిన బెంగళూరు.. ప్రపంచంలోనే అందులో రెండో స్థానం !! | Bangalore placed top 2 in slow driving while traffic

Bengaluru trafic creates world record
Story first published: Friday, February 17, 2023, 9:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X