For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bandhan Bank Q4: దెబ్బకొట్టిన నిరర్థక ఆస్తులు..లోన్ రికవరీ: భారీగా తగ్గిన నెట్ ప్రాఫిట్

|

ముంబై: ప్రైవేటు రంగానికి చెందిన బంధన బ్యాంక్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ఆ బ్యాంకు నెట్ ప్రాఫిట్‌లో 80 శాతం క్షీణత చోటు చేసుకుంది. బ్యాడ్ లోన్స్ ఈ బ్యాంక్ ఆదాయాన్ని దెబ్బతీసినట్లుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిరర్థక ఆస్తుల శాతం ప్రతి సంవత్సరం పెరిగిపోతోండటం, రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి కారణాలు బ్యాంక్ పనితీరు, ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింంచినట్లు అంచనా వేస్తోన్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 80 శాతం మేర క్షీణత కనిపించింది. ఆ బ్యాంక్‌కు వచ్చిన ఆదాయం 103 కోట్ల రూపాయలే.

2019-2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 517.3 కోట్ల రూపాయలు. ఏడాది తిరిగే సరికి ఈ మొత్తం 103 కోట్ల రూపాయలకు దిగజారింది. 80.1 శాతం మేర పతనాన్ని చవి చూసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కొత్తగా అయిదు లక్షల అకౌంట్లను తెరచినట్లు బంధన్ బ్యాంక్ లిమిటెడ్ యాజమాన్యం తన క్యూ4లో పేర్కొంది. ఏడాది పొడవునా 29 లక్షల కొత్త కస్టమర్లు జత అయ్యారని, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి క్లయింట్ల సంఖ్య 2.30 కోట్లకు చేరిందని తెలిపింది.

Bandhan Bank Q4: Net Profit Falls 80 percent

నెట్ ప్రాఫిట్‌లో 80 శాతం మేర క్షీణత రావడానికి కారణం హయ్యర్ ప్రొవిజన్స్ కారణమని తెలుస్తోంది. ఈ ప్రొవిజన్లు 1,594 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 827.36 కోట్ల రూపాయలే. కాగా.. బంధన్ బ్యాంక్ నెట్ ఇంటరెస్ట్‌లో భారీ పెరుగుదల కనిపించింది. 4.6 శాతం మేర పెరిగి 1,757 కోట్ల రూపాయలుగా రికార్డయింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 1,680 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పుడిది 1,757 కోట్ల రూపాయలకు చేరింది. నిరర్థక ఆస్తుల విలువ 3.5 శాతానికి చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఈ సంఖ్య 2.4 శాతంగా ఉండేది. చివరి త్రైమాసికంలో 87,043 కోట్ల రూపాయలను రుణాలను మంజూరు చేయగా.. ఇందులో 58,350 కోట్లు మైక్రోఫైనాన్స్‌కు ఇచ్చినవే.

English summary

Bandhan Bank Q4: దెబ్బకొట్టిన నిరర్థక ఆస్తులు..లోన్ రికవరీ: భారీగా తగ్గిన నెట్ ప్రాఫిట్ | Bandhan Bank Q4: Net Profit Falls 80 percent

Bandhan Bank Ltd.'s quarterly profit fell as provisions rose against an elevated level of bad loans. Net profit fell 80% year-on-year to Rs 103 crore in the January to March quarter, it said in an exchange filing.
Story first published: Saturday, May 8, 2021, 18:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X