కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరంలో ఎన్పీఏలు పెరుగుతాయని ప్రయివేటు సెక్టార్ లెండర్ యాక్సిస్ బ్యాంక్ అంచనా వేస్తోంది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి తిరిగి పూర్వస్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంలో రిటైల్ ఎన్పీఏలు భారీగా పెరగవచ్చునని భావిస్తోంది. కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. వివిధ రంగాల్లోని సంస్థలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటాయి. కరోనా వల్ల కార్యకలాపాలు నిలిచిపోవడంతో బ్యాంకులకు ఈఎంఐలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం వెసులుబాటు కల్పించారు.

క్రమంగా మెరుగు
కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో వివిధ ఆర్థిక సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగడంతో రిటైల్ రుణ చెల్లింపుల సామర్థ్యం తగ్గిందని యాక్సిస్ బ్యాంకు రిటైల్ రుణ విభాగాధిపతి తెలిపారు. ఇప్పుడిప్పుడే నెలవారీగా చెల్లించే ఈఎంఐలు మెరుగు పడుతున్నాయని, అయినా డిసెంబర్ త్రైమాసికం, మార్చి త్రైమాసికాలలో రిటైల్ ఎన్పీఏలు పెరగవచ్చునని తెలిపారు.

లోన్ రీస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నారు..
2021 ఏప్రిల్ నుండి తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందన్నారు. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి కోలుకోవచ్చునని తెలిపారు. ఆగస్ట్ వరకు రుణ మారటోరియం ఉండటంతో చాలామంది రుణగ్రహీతలు దీనిని వినియోగించుకున్నారు. అక్టోబర్ నుండి చెల్లిస్తున్నారు. అయితే ఎక్కువ మంది లోన్-రీస్ట్రక్చరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు లోన్ రీస్ట్రక్చర్ దరఖాస్తులకు వెసులుబాటు ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో దీనిని ఉపయోగించుకుంటున్నారు.

క్రెడిట్ కార్డు రుణ సామర్థ్యం తగ్గింపు
కొత్త రుణాల విషయానికి వస్తే కరోనా పూర్వస్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. రిస్క్ ఎక్కువగా ఉండటంతో క్రెడిట్ కార్డుల ఇచ్చే రుణాల సామర్థ్యాన్ని అరవై శాతం నుండి డెబ్బై శాతంగానే పరిమితం చేసినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications