For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహన కస్టమర్లకు ఊరట: వారంటీ, ఫ్రీ-సర్వీసింగ్ పీరియడ్ పొడిగింపు

|

దేశ‌వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరిగి అంతా చిన్నాభిన్నమైంది. కరోనా దెబ్బతో అన్నివ‌ర్గాలు, రంగాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ చెందుతున్నారు. ప‌లు ఆటోమొబైల్ సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్ల వ్యారంటీ, స‌ర్వీసింగ్ పీరియ‌డ్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హోండా మోటార్స్ సైకిల్స్ గడువును పెంచాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా,

మహీంద్రా అండ్ మహీంద్రా,

దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్‌ను జూలై 31వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తన కస్టమర్లకు ఊరటను ఇచ్చింది. క‌రోనా నియంత్రణకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండటంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఏప్రిల్ ఒక‌టవ తేదీ నుండి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వారంటీ గ‌డువు ముగిసే వారికి ఇది వ‌ర్తిస్తుంది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్

జ‌ర్మ‌న్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ భార‌త్‌లోని త‌మ క‌స్ట‌మ‌ర్ల వారంటీ, స‌ర్వీస్ ప్లాన్స్‌ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే నెల‌ల్లో వారంటీ లేదా స‌ర్వీసింగ్ ప్లాన్స్ ముగిసే కార్ల‌కు ఈ పొడిగింపు అందుబాటులో ఉంటుంది.

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కమర్షియల్ వెహికిల్స్ కస్టమర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనాను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

బజాజ్ ఆటో మొబైల్స్

బజాజ్ ఆటో మొబైల్స్

బజాజ్ ఆటో మొబైల్స్ తమ అన్ని బ్రాండ్స్ వాహనాలకు జూలై చివరి వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ ముగిసే వాహనాలకు వర్తిస్తుంది. హోండా మోటార్స్ తన అన్ని మోడల్ బైక్స్, స్కూటర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను జూలై నెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య వారంటీ గడువు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.

English summary

వాహన కస్టమర్లకు ఊరట: వారంటీ, ఫ్రీ-సర్వీసింగ్ పీరియడ్ పొడిగింపు | Auto companies extend warranty and service period because of COVID 19 pandemic

Mahindra & Mahindra on May 23 said it has extended the warranty and service period on its entire range of vehicles till July 31 due to lockdown in several states in the wake of the pandemic. This will be applicable for those customers whose warranty is due to expire between April 1 and May 31, it said.
Story first published: Wednesday, May 26, 2021, 7:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X