For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకుంటే రూ.2500 వచ్చాయి

|

మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఏటీఎం మిషన్ నుండి రూ.500 ఉపసంహరించుకోవాలనుకంటే రూ.2500 వచ్చాయి. అంట ఏటీఎం డిస్పెన్సెస్ మిషన్ పైన మనం ఎంటర్ చేసిన దాని కంటే ఐదు రెట్ల డబ్బును ఇచ్చింది. ఈ సంఘటన నాగపూర్ జిల్లాలోని ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రయివేటు బ్యాంకులో జరిగింది. దీంతో ఆ ఏటీఎం కేంద్రానికి జనం బారులు తీరారు.

బుధవారం నాడు ఓ వ్యక్తి ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను నమోదు చేసిన రూ.500కు బదులు రూ.500 కరెన్సీ నోట్లు రూ.5 రావడంతో ఆశ్చర్యపోయాడు. అతను మరోసారి రూ.500 తీసుకొని టెస్ట్ చేశాడు. మళ్లీ రూ.2500 వచ్చాయి. ఈ వార్త స్థానికంగా అందరికీ తెలిసింది.

ATM dispenses five times extra cash in Maharashtra

దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకొని, ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. అయితే ఇక్కడ ఓ పొరపాటు జరిగినట్లుగా గుర్తించారు. చిన్న పొరపాటు ఇంత పెద్ద తలనొప్పికి కారణమైంది. రూ.100 విలువైన నోట్లను ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను పొరపాటుగా జమ చేశారు. దీంతో ఐదు రెట్లు అధికంగా వచ్చాయి.

English summary

ఆ ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకుంటే రూ.2500 వచ్చాయి | ATM dispenses five times extra cash in Maharashtra

A man who came to withdraw Rs 500 from an ATM in Nagpur on Wednesday got five currency notes of Rs 500 denomination from the cash dispenser.
Story first published: Thursday, June 16, 2022, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X