For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్-ఫేస్‌బుక్ కంటే ఆపిల్ ఎం-క్యాప్ ఎక్కువ: అమెరికా జీడీపీలో 10%, భారత్‌తో మూడొంతులు

|

ఆపిల్ ఇంక్ 2.13 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రికార్డు సృష్టించి, మోస్ట్ వ్యాల్యుబల్ కంపెనీగా నిలిచింది. సెర్చింజన్ గూగుల్(1.09 ట్రిలియన్ డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం(800 బిలియన్ డాలర్స్) రెండింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువగా ఉంది. ఆపిల్ ఆగస్ట్ 19న 2 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ రికార్డుకు చేరుకున్న తొలి అమెరికా కంపెనీ ఇదే. ఏప్రిల్-జూన్ 2020 క్వార్టర్‌లో భారీ లాభాలను నమోదు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐఫోన్ సేల్స్ పడిపోయాయి. కానీ ఆపిల్ టీవీ, ఆపిల్ మ్యూజిక్, కొత్త ఐఫోన్ ఎస్ఈ భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీలు

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీలు

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల్లో ఆపిల్ 2.135 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది అమెరికా కంపెనీ.

ఆ తర్వాత సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో(2.049 ట్రిలియన్ డాలర్లు) ఉంది.

అమెజాన్(1.676 ట్రిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్(1.638 ట్రిలియన్ డాలర్లు), అల్పాబెట్(గూగుల్-1.093 ట్రిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్(800 బిలియన్ డాలర్లు)తో అమెరికాకు చెందిన ఈ కంపెనీలు వరుసగా 3వ, 4వ, 5వ, 6వ స్థానంలో ఉన్నాయి.

చైనాకు చెందిన అలీబాబా(764.82 బిలియన్ డాలర్లు), టెన్సెంట్(689.22 బిలియన్ డాలర్లు) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నాయి.

అమెరికాకు చెందిన కంపెనీలు బెర్క్‌షైర్ హాత్‌వే(509.54 బిలియన్ డాలర్లు), వీసా(456.87 బిలియన్ డాలర్లు), జాన్సన్ అండ్ జాన్సన్(400.34 బిలియన్ డాలర్లు) వరుసగా 9, 10, 11వ స్థానాల్లో ఉండగా, 12వ స్థానంలో తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ 383.58 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉంది.

ఇండియా జీడీపీలో మూడొంతులు.. ఆపిల్

ఇండియా జీడీపీలో మూడొంతులు.. ఆపిల్

ఆపిల్ ఇంక్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజషన్‌తో రికార్డ్ సృష్టించింది. అమెరికా జీడీపీలో ఆపిల్ ఇంక్ దాదాపు 10 శాతంగా ఉంటుంది. భారత జీడీపీతో చూస్తే నాలుగింట మూడింతలు ఉంటుంది. 0 నుండి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగడానికి ఆపిల్‌కు 42 సంవత్సరాలు తీసుకుంది. అయితే 1 ట్రిలియన్ డాలర్ల నుండి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి కేవలం రెండేళ్లు మాత్రమే తీసుకుంది. దాదాపు జూలై 31వ తేదీ నుండి ఆపిల్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా ఉంది. ఆపిల్ స్టార్ ప్రోడక్ట్ ఐఫోన్ వాటా 50 శాతంగా ఉంటుంది.

కంపెనీల షేర్ వ్యాల్యూ

కంపెనీల షేర్ వ్యాల్యూ

టాప్ కంపెనీ స్టాక్స్‌లో ఆపిల్ షేర్ ధర 499 డాలర్లు, సౌదీ ఆరామ్‌కో 9.31 డాలర్లు, అమెజాన్ 3,345.86 డాలర్లు, మైక్రోసాఫ్ట్ 216.46 డాలర్లు, అల్పాబెట్ 1,607 డాలర్లు, ఫేస్‌బుక్ 281 డాలర్లు, అలీబాబా 286 డాలర్లు, టెన్సెంట్ 70 డాలర్లుగా ఉంది.

1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఫేస్‌బుక్

1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ స్టాక్స్ మంగళవారం ఆల్ టైమ్ గరిష్టం 280.82 డాలర్లకు చేరుకున్నాయి. మార్చి కనిష్టం నుండి 105 శాతం ఎగిశాయి. కాగా, రేటింగ్ ఏజెన్సీలు ఫేస్‌బుక్ టార్గెట్ ధరను 330 డాలర్లుగా పేర్కొన్నాయి. దీంతో రానున్న కొద్దిరోజుల్లో ఫేస్‌బుక్ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ ధర 351 డాలర్లకు చేరుకుంటే 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా నిలుస్తుంది. 1 ట్రిలియన్ డాలర్ల టెక్ కంపెనీల్లో ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, అల్పాబెట్ ఉన్నాయి.

English summary

గూగుల్-ఫేస్‌బుక్ కంటే ఆపిల్ ఎం-క్యాప్ ఎక్కువ: అమెరికా జీడీపీలో 10%, భారత్‌తో మూడొంతులు | At $2 trillion, Apple is the most valuable company in the world

Apple inc has made a history by touching $2 Trillion market capitalization. Apple business for the June 2020 quarter hasn't seen a slump amidst corona problem.
Story first published: Thursday, August 27, 2020, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X