Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ ఎస్‌డిఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్..
అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఎస్‌డిఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది నిఫ్టీ ఎస్‌డిఎల్ సెప్టెంబర్ 2026 ఇండెక్స్‌లోని భాగాలలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్.కొత్త ఫండ్ ఆఫర్ (NFO) 4 నవంబర్ ప్రారంభమైంది 16 నవంబర్ ముగుస్తుంది.స్కీమ్‌కి ఫండ్ మేనేజర్ ఆదిత్య పగారియాగా ఉన్నారు. మరియు కనీస పెట్టుబడి మొత్తం ₹5,000 మరియు ఆ తర్వాత రూ. 1 గుణిజాల్లో ఉంటుంది.
టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ నిర్దిష్ట మెచ్యూరిటీ బకెట్లను యాక్సెస్ చేయడానికి పెట్టుబడిదారులను అనుమతిస్తాయి. ఈ ఫండ్‌లకు లాక్-ఇన్‌లను ఉండవు, అందువల్ల పెట్టుబడిదారులకు లిక్విడిటీని అందిస్తాయి, వారు ఎటువంటి అవాంతరాలు లేకుండా మిడ్-టర్మ్ రీడీమ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. యాక్సిస్ నిఫ్టీ SDL సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్ ముందుగా పేర్కొన్న బెంచ్‌మార్క్/ఇండెక్స్‌ను వీలైనంత దగ్గరగా ట్రాక్ చేయడం పెట్టుబడులు పెడతారు.
