For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా తొలి ఇద్దరు కుబేరులు మనోళ్ళే: చైనా ధనికుడిని వెనక్కి నెట్టిన అదానీ

|

ఇప్పుడు ఆసియా కుబేరుల్లో తొలి రెండు స్థానాలు భారత్‌వే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఎంతోకాలంగా ప్రపంచ బిలియనీర్లలో టాప్ 10లో లేదా టాప్ 20లో ఉంటున్నారు. ఆసియాలో అయితే ఆయనే నెంబర్ వన్ కుబేరుడు. తాజాగా ఆసియా రెండో కుబేరుడిగా అవతరించారు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. ఇటీవలి కాలంలో ఆయన సంపద అమాంతం పెరిగింది. దీంతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఎలాన్ మస్క్, డ్రాగన్ కంట్రీ ఎఫెక్ట్: 40,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్ఎలాన్ మస్క్, డ్రాగన్ కంట్రీ ఎఫెక్ట్: 40,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్

ఆయన ఆస్తి తగ్గి, ఈయనది పెరిగింది

ఆయన ఆస్తి తగ్గి, ఈయనది పెరిగింది

చైనాకు చెందిన టైకూన్ జోంగ్ షన్‌షాన్ ఇప్పటి వరకు ఆసియా రెండో ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం షన్‌షాన్ సంపద ఇటీవల 6,360 కోట్ల డాలర్లకు కరిగిపోయింది. అదే సమయంలో అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీతో గౌతమ్ అదానీ సంపద 6,650 కోట్లకు పెరిగింది. మన కరెన్సీలో ఇది రూ.4.86 లక్షల కోట్లు. ఈ ఏడాది అదానీ ఆస్తి రూ.3,270 కోట్ల డాలర్ల మేర పెరిగింది. అదే సమయంలో షన్‌షాన్ ఆస్తి రూ.1,460 కోట్లు క్షీణించింది.

కరిగిపోయిన ముఖేష్ అంబానీ సంపద

కరిగిపోయిన ముఖేష్ అంబానీ సంపద

ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద ఏడాదిలో 17.55 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుతం ఆయన సంపద 7650 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. మన కరెన్సీలో ఇది రూ.5.58 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ 14వ స్థానానికి చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. ఇక, చైనా కుబేరుడు 14వ స్థానం నుండి 15వ స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆనకు చెందిన రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల్లోకి రావడంతో ప్రపంచంలోనే ఆరో సంపన్నుడయ్యాడు.

కరోనా సమయంలో కొనుగోలు

కరోనా సమయంలో కొనుగోలు

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్సుమిషన్ వంటి స్టాక్స్ భారీగా ఎగిశాయి. దీంతో ఆయన సంపద పెరిగింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఒత్తిడిలో ఉన్న కంపెనీలను తక్కువ వ్యాల్యూకే అదానీ గ్రూప్ అక్వైజేషన్ చేసుకుంది. అదానీ గ్రీన్ ఇటీవలే ఎస్బీ ఎనర్జీని 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశంలోని ఈస్టర్న్, వెస్టర్న్ ప్రాంతాల్లో అదానీ పోర్ట్స్ పలు పోర్ట్స్‌ను కొనుగోలు చేసింది. సీబార్న్ కార్గోలో ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆదీనంలో 25 శాతం వరకు ఉందని నివేదికలు చెబుతున్నాయి.

English summary

ఆసియా తొలి ఇద్దరు కుబేరులు మనోళ్ళే: చైనా ధనికుడిని వెనక్కి నెట్టిన అదానీ | Asia's richest and second richest persons are now Indians

Billionaire Gautam Adani has edged past Chinese tycoon Zhong Shanshan to become the second-richest Asian, according to the Bloomberg Billionaire Index, as the stock prices of his listed companies soared.
Story first published: Friday, May 21, 2021, 7:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X