For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..

|

BharatPe: భారత పే వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ జీతాల విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1.69 కో ట్ల వేతనాన్ని అందుకున్నారు. ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ రూ.63 లక్షలు జీతంగా అందుకున్నారు. ఫైనాన్స్ మిస్ కాండక్ట్ కారణంగా ఈ జంట 2022లో ఫిన్ టెక్ కంపెనీ నుంచి తొలగించబడ్డారు.

రికార్డుల ప్రకారం..

రికార్డుల ప్రకారం..

భారత్ పే మాజీ సీఈవో సుహైల్ సమీర్ 2022 ఆర్ఖిక సంవత్సరంలో రూ.2.1 కోట్ల వేతనాన్ని పొందారు. ఈ నెల ప్రారంభంలో సమీర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే క్రమంలో కంపెనీ వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యుడు శాశ్వత్ నక్రానీ రూ.29.8 లక్షలు, బోర్డు సభ్యుడు కేవల్ హండా రూ.36 లక్షలు వేతనంగా అందుకున్నారు. కంపెనీ ప్రకారం వ్యక్తులకు షేర్-ఆధారిత చెల్లింపులు ఈ పరిహారంలో భాగం కాదు.

పెరిగిన ఖర్చులు..

పెరిగిన ఖర్చులు..

2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ షేర్ ఆధారిత చెల్లింపు ఖర్చులు 218 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరుకున్నాయి. FY22లో BharatPe ఎగ్జిక్యూటివ్ బృందానికి ఇచ్చిన రూ.315 కోట్ల ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌ల (ESOPలు) పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ మేనేజ్‌మెంట్ బృందంలోని రజనీష్ కుమార్, శాశ్వత్ నక్రానీ, సుహైల్ సమీర్, సుమీత్ సింగ్ మెజారిటీ ESOPలను అందుకున్నట్లు గ్రోవర్ ఇన్వెస్టర్లు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కంపెనీ ఆదాయం..

కంపెనీ ఆదాయం..

ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ 2022 ఆర్థిక సంవత్సరానికి 284 శాతం పెరిగి రూ.457 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో కంపెనీ నికర నష్టాలు 3.5 రెట్లు పెరిగి రూ.5,610 కోట్లకు చేరుకుంది. కంపెనీ జాతాలు, వేతనాల ఖర్చు సైతం 116 శాతం పెరిగి రూ.110 కోట్లకు చేరుకున్నాయి. అడ్వర్టైజింగ్ ఖర్చులు 535 శాతం పెరిగి రూ.246 కోట్లకు చేరాయి.

English summary

BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా.. | Ashneer Grover's salary pay details revealed by Bharatpe

Ashneer Grover's salary pay details revealed by Bharatpe
Story first published: Sunday, January 29, 2023, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X