For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్ఫాబెట్ చీఫ్‌గా సుందర్ పిచాయ్: ఫౌండర్స్‌కు 2 బిలియన్ డాలర్ల రిటైర్మెంట్ గిఫ్ట్

|

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. మాతృసంస్థ అల్ఫాబెట్‌కు కూడా ఆయన సీఈవోగా వ్యవహరించనున్నారు. ఈ టెక్ దిగ్గజ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా మారనున్నారు.

ఫేజ్ తన సీఈవో స్థానం నుంచి, బ్రిన్ తన ప్రెసిడెంట్ హోదా నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. దీంతో సుందర్ పిచాయ్ అల్ఫాబెట్ సీఈవో బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. దీంతో అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా పిచాయ్ మారనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

 As Sundar Pichai becomes Alphabet chief, founders get $2 bn retirement gift

సుందర్ పిచాయ్ ఇకపై సెర్చ్, వ్యాపార ప్రకటనలు, మ్యాప్స్, స్మార్ట్ ఫోన్ సాఫ్టువేర్, ఆన్ లైన్ వీడియో తదితర విభాగాలతో పాటు డ్రోన్ డెలివరీలు, ఇంటర్నెట్ బీమింగ్ బెలూన్స్ వంటి వాటికి చీఫ్‌గా వ్యవహరించనున్నారని పేర్కొంది.

అల్ఫాబెట్ ఇప్పుడు మెరుగైన వ్యవస్థను కలిగి ఉందని, అదే విధంగా గూగుల్, ఇతర అనుబంధ కంపెనీలు స్వతంత్ర కంపెనీలుగా సమర్థవంతంగా పని చేస్తున్నాయని, ఈ సమయంలో తమ యాజమాన్య నిర్మాణాలను సరళీకరించాల్సి ఉందని, అల్ఫాబెట్, గూగుల్‌కు ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని ఫేజ్, బ్రిన్ పేర్కొన్నారు. సుందర్ పిచాయ్ ఇక గూగుల్‌తో పాటు అల్ఫాబెట్‌కు చెందిన పెట్టుబడులు, ఇతర పోర్ట్ పోలియోలకు కూడా బాధ్యత వహిస్తారని వారు ఓ లేఖలో పేర్కొన్నారు. గూగుల్, అల్ఫాబెట్‌లో తాము బోర్డు సభ్యులుగా, వాటాదారులుగా, సహ వ్యవస్థాపకులుగా కొనసాగుతామని, సుందర్ పిచాయ్‌తో తమకు ఇష్టమైన అంశాల గురించి చర్చిస్తుంటామన్నారు.

ఇదిలా ఉండగా, లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు తమ రిటైర్మెంట్ గిఫ్ట్‌గా ఇన్వెస్టర్ల నుంచి 2.3 బిలియన్ డాలర్లు పొందనున్నారు. కంపెనీ షేర్ 1.9 శాతం పెరిగింది. దీంతో ఈ సహ వ్యవస్థాపకుల నికర వ్యాల్యూ ఒక్కొక్కరికి 1 బిలియన్ డాలర్లు పెరిగింది. వారిద్దరికీ ఈ సంస్థలో చెరో 6 శాతం షేర్ ఉంది. వీరి స్పెషల్ ఓటింగ్ షేర్ ద్వారా అల్ఫాబెట్‌ను నిర్వహిస్తున్నారు.

ఆపిల్ ఇంక్ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ కార్ప్ సత్యనాదెళ్లల వలె సుందర్ పిచాయ్ కూడా ఇందులో సుదీర్ఘకాలంగా పని చేస్తున్నారు. ఇక్కడ చేరిన పదిహేనేళ్ళ అనంతరం ఆయన ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు.

బ్రిన్, పేజ్ 1998లో ఈ కంపెనీని కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజీలో స్థాపించారు. 2018 నాటికి ఇది 137 బిలియన్ డాలర్ల రెవెన్యూ కలిగి ఉంది. మార్కెట్ వ్యాల్యూ 893 బిలియన్ డాలర్లుగా ఉంది. S&P 500 ఇండెక్స్ సూచీలో ఆపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత ఉంది.

English summary

అల్ఫాబెట్ చీఫ్‌గా సుందర్ పిచాయ్: ఫౌండర్స్‌కు 2 బిలియన్ డాలర్ల రిటైర్మెంట్ గిఫ్ట్ | As Sundar Pichai becomes Alphabet chief, founders get $2 bn retirement gift

Larry Page and Sergey Brin just got a $2.3 billion retirement gift from investors. The Google co founders, who announced Tuesday they were stepping down from day-to-day management of parent Alphabet Inc, added more than $1 billion each to their net worth as the firm’s shares rose 1.9 per cent in New York.
Story first published: Thursday, December 5, 2019, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X