For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరలు తగ్గుతాయా, బడ్జెట్‌లో నిర్మలమ్మ గుడ్‌న్యూస్!

|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెలలో నాలుగుసార్లు అతి స్వల్పంగా పెరిగాయి. కరోనా విపత్తు నుండి ప్రపంచం క్రమంగా కోలుకుంటోంది. దీంతో చమురుకు డిమాండ్ పెరిగి, పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు, ఓపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?

ఎక్సైజ్ డ్యూటీ

ఎక్సైజ్ డ్యూటీ

పెట్రోల్ ధరలు కొన్ని నగరాల్లో రూ.90ని క్రాస్ చేశాయి. డీజిల్ ధరలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్ నెలలో చమురు ధరలు 60 డాలర్ల నుండి 20 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 22న బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్‌కు 55.37 డాలర్లకు చేరుకుంది. లాక్ డౌన్ సమయంలో పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.32.98, డీజిల్ పైన రూ.19.98కి పెంచారు. అంతకుముందు పెట్రోల్ పైన రూ.31.83, డీజిల్ పైన రూ.15.83గా ఉంది. ప్రతి లీటర్ పైన విధించే ఒక రూపాయి ఎక్సైజ్ డ్యూటీతో ప్రభుత్వానికి అదనంగా రూ.14500 కోట్ల ఆదాయం వస్తోంది.

తగ్గించాలని లేఖ

తగ్గించాలని లేఖ

అయితే ఈ బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు సహజవాయువు శాఖ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని సూచించింది.

ఎంత తగ్గవచ్చు

ఎంత తగ్గవచ్చు

కరోనా నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ కాలంలో కేంద్రం పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, ఈ ట్యాక్స్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే లీటర్ పెట్రోల్ పైన కనీసం రూ.5 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. దేశీయ చమురు రంగ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.

English summary

పెట్రోల్ ధరలు తగ్గుతాయా, బడ్జెట్‌లో నిర్మలమ్మ గుడ్‌న్యూస్! | As fuel prices rise, Centre mulls excise duty cut

Is it just rising global crude oil price that is causing a spike in petrol and diesel prices here? Read on to know what exactly is the reason for your higher fuel bills.
Story first published: Sunday, January 24, 2021, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X