For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??

|

PMCares: కరోనా విజృంభించిన సమయంలో.. ఆక్సిజన్ పరికరాలు లేక, సరైన వైద్యం అందక పలువురు బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం సైతం శత విధాలా ప్రయత్నించింది. అందులో భాగంగా 'PMCares' అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసింది. పౌరుల వైద్య అవసరాలు తీర్చేందుకు సాధారణ ప్రజలు, సంస్థల నుంచి విరాళాలు సేకరించింది. అయితే ఆ నిధుల వినియోగంపై కొంత దుమారం చెలరేగగా.. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

RTI కిందకు రాదు:

RTI కిందకు రాదు:

PMCares గురించి ఢిల్లీ హైకోర్డులో మంగళవారం వాదనలు జరిగాయి. PMCares ఫండ్ అనేది పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అని, భారత ప్రభుత్వం నియంత్రించడం లేదని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. RTI చట్టం కిందకు వచ్చే పబ్లిక్ అథారిటీ కాదని.. వ్యక్తులు, సంస్థల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను స్వీకరించిందని అఫిడవిట్‌ లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంట్ లేదా రాష్ట్రాలు చేసిన చట్టాల ఆధారంగా నెలకొల్పలేదని వెల్లడించింది.

జాతీయం చేయాలి:

జాతీయం చేయాలి:

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ముందు.. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం వాదనలు జరిగాయి. పనితీరులో పారదర్శకతను నిర్ధారించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం PMCares ను జాతీయం చేయాలంటూ ఈ పిల్ నమోదైంది.

అధికారిక చిహ్నాల మాటేమిటి ?

అధికారిక చిహ్నాల మాటేమిటి ?

పిటిషనర్ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. ఉన్నత స్థాయిలోని ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగ పదవుల్లోని భాద్యత గల వ్యక్తులు PMCares కు విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరినట్లు ఆయన గుర్తుచేశారు. వెబ్‌ సైటులోనూ భాతర ప్రభుత్వ డొమైన్, ప్రధాని ఫొటోతో పాటు అధికారిక చిహ్నం (అశోక చక్రం)ను వినియోగించినపుడు ఆ ట్రస్టు ఎందుకు రాజ్యాంగం పరిధిలోకి రాదో చెప్పాలని ప్రశ్నించారు.

నమ్మకం లేక కాదు:

నమ్మకం లేక కాదు:

"ట్రస్టీలపై విశ్వాసం లేదని మేము అనడం లేదు. నిధులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నాం. రాజ్యాంగ పరిధిలోకి రాదంటూ ఈ ఫండ్ ను ఇష్టం వచ్చినట్లు వినియోగించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని న్యాయవాది దివాన్ చెప్పారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వం తరఫున ఏ సంస్థా ఈ ట్రస్టును నియంత్రించడం లేదని కేంద్రం పేర్కొంది. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే ప్రభుత్వాధికారులతో కూడిన ట్రస్టీల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపింది.

ఇతర ట్రస్టుల మాదిరిగానే..

ఇతర ట్రస్టుల మాదిరిగానే..

PM రిలీఫ్ ఫండుకు ఏ విధంగా అధికారిక చిహ్నాలను వినియోగిస్తున్నామో, అలాగే PMCares కు సైతం వాడామని కేంద్రం పేర్కొంది. దేశంలోని ఇతర ట్రస్టులకు ఉన్న నియమనిబంధనలనే పాటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధికి ఇచ్చిన విరాళాలపై ఆదాయపు పన్ను మినహాయింపును ఇచ్చినట్లు గుర్తు చేసింది. ఫండ్ నుంచి మంజూరు చేయబడిన గ్రాంటులు, ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం వాయిదాను కోరింది.

Read more about: narendra modi
English summary

PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..?? | Arguments in Delhi high court on PMCares nationalization

Arguments in the court on PMCares
Story first published: Wednesday, February 1, 2023, 7:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X