For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ డీల్ బ్రేక్, భారత్‌పై ఆరామ్‌కో సరికొత్త ప్లాన్

|

ఆరామ్‌కో-రిలయన్స్ డీల్‌కు చెక్ పడింది. పలు కారణాలతో ఈ డీల్ రద్దవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కో భారత్‌లో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ ఆగిపోయిన నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. భారత్‌లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తమ కీలక భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం పునఃపరిశీలనతో పాటు, కొత్త పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఉద్దేశించి తెలిపింది.

పెట్టుబడులపై ప్రకటన

పెట్టుబడులపై ప్రకటన

రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్, ఆయిల్ రిటైలింగ్ వ్యాపారంలో కొంత వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించాలని రెండేళ్ల క్రితం నిర్ణయించారు. దీని ప్రకారం గుజరాత్‌లోని జాంనగర్‌లో ఉన్న రెండు రిఫైనరీల్లో, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 20 శాతం, ఆయిల్ రిటైలింగ్ జాయింట్ వెంచర్ అయిన బ్రిటీష్ పెట్రోలియం(BP)లో 51 శాతం వాటా సౌదీ ఆరామ్‌కోకు ఇవ్వాలి. ఈ ట్రాన్సాక్షన్స్ గత ఏడాది మార్చి నాటికే పూర్తికావలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. దీంతో తాజాగా వ్యాపార పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని తిరిగి పరిశీలించాలని నిర్ణయించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరామ్‌కో నుండి భారత్‌లో కొత్త పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామనే ప్రకటన వెలువడింది.

స్టాక్ పతనం

స్టాక్ పతనం

ఆరామ్‌కోతో డీల్‌కు చెక్ పడిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ క్షీణించింది. ఈ స్టాక్ 4 శాతం కంటే పైగా నష్టపోయి రూ.2,365.65 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో ఇది రూ.2473 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం, అలాగే లైఫ్ టైమ్ గరిష్టం రూ.2751. ఈ డీల్‌కు చెక్ పడిన అనంతరం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.75 లక్షల కోట్లకు పడిపోయింది. వివిధ పరిణామాల నేపథ్యంలో బ్రోకరేజీ ఫర్మ్ జెఫెరీస్ O2C బిజినెస్ లాభాలను తగ్గించింది. బిజినెస్ వ్యాల్యూ గతంలో 80 బిలియన్ డాలర్లు అంచనా వేయగా, దీనిని 70 బిలియన్ డాలర్లకు సవరించింది.

ప్రతికూల సెంటిమెంట్ కానీ

ప్రతికూల సెంటిమెంట్ కానీ

ఆరామ్‌కో-రిలయన్స్ డీల్ ఆగిపోవడం రిలయన్స్ స్టాక్ పైన ప్రతికూల సెంటిమెంట్ చూపుతుందని జేపీ మోర్గాన్ తెలిపింది. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని కూడా అభిప్రాయపడింది. ఆరామ్‌కో-రిలయన్స్ మధ్య 2019లో డీల్ కుదిరింది. ఈ డీల్ వ్యాల్యూ 15 బిలియన్ డాలర్లు.

English summary

రిలయన్స్ డీల్ బ్రేక్, భారత్‌పై ఆరామ్‌కో సరికొత్త ప్లాన్ | Aramco eyes new investments in India after Reliance Industries scraps deal

Saudi Aramco said it will continue to look for investment opportunities in India, days after Reliance Industries Ltd. scrapped a plan to sell a stake in its oil-to-chemicals unit to the Middle Eastern company.
Story first published: Monday, November 22, 2021, 20:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X