For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో యాపిల్ ఐఫోన్ ‘ఎక్స్ఆర్’ మోడల్ తయారీ ప్రారంభం!

|

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ భారత్‌లో తన ఐఫోన్ మోడల్ 'ఎక్స్ఆర్' తయారీని ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

కాలిఫోర్నియాలో డిజైన్ చేయబడిన ఈ ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీని భారత్‌లో చేసేందుకు వీలుగా యాపిల్ సాల్‌కాంప్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మోడల్ ఫోన్ దేశీయ అమ్మకాలతోపాటు ఎగుమతులు కూడా ఇక్కడ్నించే జరుగుతాయని ఆయన వెల్లడించారు.

ఛార్జర్లు సరఫరా చేసే కంపెనీతో...

ఛార్జర్లు సరఫరా చేసే కంపెనీతో...

ఫిన్లాండ్‌కు చెందిన సాల్‌కాంప్.. యాపిల్‌ కంపెనీకి మొబైల్ ఛార్జర్లు సరఫరా చేస్తోంది. ఇప్పుడు భారత్‌లో ‘ఐఫోన్ ఎక్స్ఆర్' మోడల్ ఫోన్ల తయారీని కూడా యాపిల్ ఈ కంపెనీకే అప్పగించింది. ఈ మేరకు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే భారత్‌లో ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీని క్యూపర్టినోకు చెందిన కంపెనీ చేపట్టనున్నట్లు, చెన్నైలోనే తన పార్ట్‌నర్ ఫాక్స్‌కాన్ ద్వారా అసెంబ్లింగ్ చేయిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. తాజాగా ‘ఐఫోన్ ఎక్స్ఆర్' తయారీ బాధ్యతను సాల్‌కాంప్ చేజిక్కించుకుంది.

చెన్నైకి సమీపంలోని ప్లాంట్‌లో...

చెన్నైకి సమీపంలోని ప్లాంట్‌లో...

యాపిల్ ఐఫోన్ 11గా పిలువబడుతున్న ‘ఐఫోన్ ఎక్స్ఆర్' మోడల్ ఫోన్ల తయారీ చెన్నైకి సమీపంలోని సెజ్‌లో జరగనుంది. దీనికోసం ఇక్కడ పదేళ్లుగా మూతపడిన నోకియా ప్లాంట్‌ను సాల్‌కాంప్ కంపెనీకి కేటాయించారు. 2020 మార్చి నెల నుంచి ఇక్కడ ఈ కంపెనీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. దీనికోసం వచ్చే ఐదేళ్లలో సాల్‌కాంప్ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

60 వేల మందికి ఉపాధి...

60 వేల మందికి ఉపాధి...

చెన్నైకి సమీపంలోని సెజ్‌లో మూతపడిన నోకియా ప్లాంట్‌ను ఇప్పుడు ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీ కోసం సాల్‌కాంప్ పునరుద్ధరిస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి కూడా లభించనుంది. ఇక్కడ తయారయ్యే యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్లు దేశీయంగా అమ్ముడుకావడమేకాక విదేశాలకు సైతం ఎగుమతి అవనున్నాయి.

త్వరలో అతిపెద్ద యాపిల్ రిటైల్ స్టోర్...

త్వరలో అతిపెద్ద యాపిల్ రిటైల్ స్టోర్...

ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీ మాత్రమేకాదు, త్వరలోనే ముంబైలో యాపిల్ తన అతిపెద్ద రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మాక్సిటీ మాల్‌లో ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. యాపిల్‌కు ఇది దేశంలోకెల్లా అతిపెద్ద స్టోర్ కానుంది. ఎంత పెద్దది అంటే.. ఆగస్టులో ముంబైలోని హై స్ట్రీట్ ఫోనిక్స్ మాల్‌లో రెండు అంతస్తుల్లో ప్రారంభమైన ఫ్లాగ్‌షిప్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్‌కు దాదాపు మూడు రెట్లు అధికం.

English summary

భారత్‌లో యాపిల్ ఐఫోన్ ‘ఎక్స్ఆర్’ మోడల్ తయారీ ప్రారంభం! | apple started iphone xr assembling in india

As per a recent tweet by Communications, Electronics & IT Minister of India, Ravi Shakar Prasad, Apple has begun the assembling of iPhone XR in India. He shared an image in the tweet where he is posing with a unit of iPhone XR which was assembled in India.
Story first published: Tuesday, November 26, 2019, 7:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X