For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు షాక్ : పెగాట్రాన్ సంస్థ‌కు లైన్ క్లియర్ .. భారత్‌లో పెరగనున్న ఐఫోన్ల ఉత్పత్తి

|

అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో పాటు రాజకీయ యుద్ధం కూడా నడుస్తున్న నేపథ్యంలో యాపిల్ సంస్థకు ఉత్పత్తిదారులుగా ఉన్న కాంట్రాక్టర్లలో రెండో అతిపెద్ద కాంట్రాక్టర్‌గా ఉన్న పెగాట్రాన్ తన సంస్థను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఈమేరకు యాపిల్ సబ్సిడరీ సంస్థగా పెగాట్రాన్ భారత్‌లో నమోదు చేసుకుంది.ఇక పెగాట్రాన్ సంస్థ ఏర్పాటు చెన్నైలో కానుంది. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో నిర్థారణం కాలేదు.

 రాష్ట్ర ప్రభుత్వాలతో పెగాట్రాన్ చర్చలు

రాష్ట్ర ప్రభుత్వాలతో పెగాట్రాన్ చర్చలు

ప్రస్తుతం పెగాట్రాన్ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన భూమిపై పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి చర్చలు పూర్తయితే ఆ తర్వాత ఫోన్ల తయారీకి కావాల్సిన మెషినరీని భారత్‌కు దిగుమతి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈవిషయం పై స్పందించేందుకు పెగాట్రాన్ ప్రతినిధులు అందుబాటులో లేరు. అదే సమయంలో యాపిల్ సంస్థ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదా అధికారిక ప్రకటన రాలేదు.

 యాపిల్ సంస్థ కాంట్రాక్టర్‌గా పెగాట్రాన్

యాపిల్ సంస్థ కాంట్రాక్టర్‌గా పెగాట్రాన్

ఇక పెగాట్రాన్‌ గురించి చెప్పాలంటే ఇది తైవాన్‌కు చెందిన సంస్థ. యాపిల్ సంస్థకు ఐఫోన్ తయారు చేసే మూడు అతిపెద్ద సంస్థల్లో పెగాట్రాన్ రెండోది. దీనికి ముందు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఉంది. ఫాక్స్‌కాన్ యాపిల్ నోట్‌బుక్స్, డెస్క్‌టాప్స్, మదర్ బోర్డులు, టాబ్లెట్ డివైసెస్, గేమ్ కన్సోల్స్ , ఎల్‌సీడీ టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, స్మార్ట్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్ మరియు నెట్‌వర్కింగ్ డివైసెస్‌లను తయారు చేస్తోంది.

 చైనా నుంచి చెన్నైకు..

చైనా నుంచి చెన్నైకు..

ప్రస్తుతం చైనాలో ఉన్న తన కంపెనీలో కొంత భాగం భారత్‌కు తరలించాలని ఈ ఏడాది మే నెలలో యాపిల్ సంస్థ భావించింది. ఇదిలా ఉంటే ఇతర దేశాల్లో తమ కంపెనీ వ్యాపార కలాపాలను విస్తరించాలని భావిస్తోందని అయితే ఇది తమ క్లయింట్ అయిన యాపిల్ అభీష్టం మేరకే ఉంటుందని ఆ సంస్థ సీఈఓ లియాఓ సై జాంగ్ చెప్పారు. అంతేకాదు ఆయా దేశ ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహాకాలపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు.

 భారత్‌లో కొంత శాతమే ఐఫోన్ల తయారీ

భారత్‌లో కొంత శాతమే ఐఫోన్ల తయారీ

గతేడాది భారత్‌లో యాపిల్ టర్నోవర్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్నిందని ఆ సంస్థ తెలిపింది. భారత్‌లో కొంత శాతం మాత్రమే ఐఫోన్లు తయారయ్యాయి. ఇక అమ్ముడుపోయిన మోడల్స్‌లో ఐఫోన్ 7 మరియు ఎక్స్‌ఆర్‌లను విస్ట్రాన్ మరియు ఫాక్స్‌కాన్ సంస్థలు తయారు చేశాయి. యాపిల్ కంపెనీకి మార్కెట్ షేర్ 2 నుంచి 3శాతం వరకే ఉండగా ప్రీమియం ఫోన్ల కేటగిరీలో మాత్రం ముందువరసలో ఉంది. ఇక చైనాలో యాపిల్‌ సంస్థకు మంచి పేరుంది. 2018-19కి గాను చైనాలో పెట్టుబడులు పెట్టిన సంస్థలో యాపిల్ సంస్థ అగ్రస్థానంలో ఉంది. చైనాలో ఎలక్ట్రానిక్ మార్కెట్లో 200 బిలియన్ డాలర్ల మార్క్‌ను యాపిల్ సంస్థ నమోదు చేసింది.

English summary

చైనాకు షాక్ : పెగాట్రాన్ సంస్థ‌కు లైన్ క్లియర్ .. భారత్‌లో పెరగనున్న ఐఫోన్ల ఉత్పత్తి | Apple Contractor Pegatron to set up its firm in India

Pegatron, Apple's second-largest contract manufacturer, has registered a subsidiary in India, setting the stage for expanding the manufacturing capacity of iPhones in the country, amid heightened US-China tensions.
Story first published: Friday, July 17, 2020, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X