For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

APIIC సంచలనం: పారిశ్రామిక కారిడార్ల వద్ద కాన్సెప్ట్ హెల్త్ సిటీలు

|

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశంలో ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, దానికి సంబంధించిన మౌలిక వసతులు ఎలాంటివనేది తేలిపోయింది. 36 లక్షలకు పైగా ఉంటోన్న కరోనా వైరస్ పేషెంట్లకు ఒకేసారి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని ఆసుపత్రులు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఐసీయూ బెడ్స్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతున్నాయి. ఆక్సిజన్ యూనిట్స్ ఖాళీ అవుతున్నాయి.

తోటి ఉద్యోగినిపై సెక్సీయెస్ట్ కామెంట్స్: యాపిల్ మేనేజర్‌పై వేటు: పరువునష్టం దావాతోటి ఉద్యోగినిపై సెక్సీయెస్ట్ కామెంట్స్: యాపిల్ మేనేజర్‌పై వేటు: పరువునష్టం దావా

పారిశ్రామికవాడల్లో కాన్సెప్ట్ హెల్త్ సిటీలు..

ఏ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. దేశంలో ఇప్పుడున్న వైద్య సదుపాయాలను అత్యవసరంగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్ఫస్టమౌతోంది. ఈ పరిస్థితుల మధ్య- ఏపీ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (APIIC) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైద్య సదుపాయాలను మరింత మెరుగుపర్చడానికి అవసరమైన తక్షణ చర్యలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న పారిశ్రామిక వాడలు, కారిడార్లలో కాన్సెప్ట్ హెల్త్ సిటీలను నిర్మించాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఏడుచోట్ల ఏర్పాటు

ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక వాడలు, కారిడార్ల సమీపంలో కాన్సెప్ట్ హెల్త్ సిటీలను నిర్మించడానికి అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు తెలిపింది. మొత్తంగా ఏడు కాన్సెప్ట్ హెల్త్ సిటీలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పారిశ్రామిక వాడలకు అతి సమీపంలో, వాటిని నిర్మిస్తామని దీనికి అవసరమైన భూసేకరణ పనులను త్వరలోనే చేపడతామని పేర్కొంది ఏపీఐఐసీ.

ఒక్కో కాన్సెప్ట్ హెల్త్ సిటీలో..

ఒక్కో కాన్సెప్ట్ హెల్త్ సిటీలో..

ఒక్కో కాన్సెప్ట్ హెల్త్ సిటీలో- ఓ కార్పొరేట్ ఆసుపత్రి, స్పెషాలిటీ నర్సింగ్ హోమ్, నర్సుల శిక్షణ ఇన్‌స్టిట్యూట్, ఆసుపత్తి నుంచి వెలువడే వ్యర్థాలను నిర్మూలించడానికి ఉద్దేశించిన బయోహజార్డ్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీ కేంద్రం.. ఇతర మౌలిక వసతులను కల్పిస్తామని ఏపీఐఐసీ వెల్లడించింది. ఒక్కో కార్పొరేట్ ఆసుపత్రిలో ఒకేసారి ఎంతమంది పేషెంట్లకు వైద్యాన్ని అందించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.

ఆక్సిజన్ ఉత్పత్తికి అనుమతి..

ఆక్సిజన్ ఉత్పత్తికి అనుమతి..

ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న పారిశ్రామిక వాడల్లో గల ఇండస్ట్రీయల్ యూనిట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీయల్ యూనిట్లు.. తమ మూల ఉత్పాదకతను కాదని..వైద్య అవసరాలకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి/మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేయడానికీ (లైన్ ఆఫ్ యాక్టివిటీ) అనుమతి ఇస్తున్నామని తెలిపింది. దీనికోసం అదనంగా ఎలాంటి ఫీజులను వసూలు చేయట్లేదని తెలిపింది.

English summary

APIIC సంచలనం: పారిశ్రామిక కారిడార్ల వద్ద కాన్సెప్ట్ హెల్త్ సిటీలు | APIIC to start work on 7 Health Cities around existing Industrial Parks

APIIC to start work on 7 Health Cities around existing Industrial Parks. These Concept Health Cities will have Corporate Hospitals, Specialty Nursing Homes, Nursing and Training Institutions, Biohazard Treatment Facility, Service Apartments and other Social Infra.
Story first published: Saturday, May 15, 2021, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X