For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

YSR Kalyanamasthu: YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా నిధుల విడుదల.. బటన్ నొక్కిన సీఎం జగన్

|

YSR Kalyanamasthu: ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద 4,536 మంది లబ్ధిదారుల ఖాతాలకు ఈ నిధులను జమ చేశారు. దీనికోసం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి సీఎం జగన్ రూ.38.18 కోట్లను విడుదల చేశారు. దీంతో ఒక్కొక్కరు రూ.లక్ష పొందనున్నారు.

ఎవరెవరికి వచ్చాయి..

ఎవరెవరికి వచ్చాయి..

అక్టోబరు-డిసెంబరు మధ్య వివాహం చేసుకుని దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ విడదతలో ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు. నెలరోజులు గడువు ఇచ్చిన తర్వాత.. ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ను పూర్తి చేసి ఈరోజు అర్హుల ఖాతాల్లోకి నదగు జమ చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. ప్రతి త్రైమాసికంలో ఈ పథకం కింద సహాయం అందిచటం కొనసాగిస్తామని వెల్లడించారు.

సీఎం ఏమన్నారంటే..

సీఎం ఏమన్నారంటే..

పేదల జీవితాలను మార్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యను అందించడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి నిధులు సహాయపడతాయన్నారు. విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించటమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.

అర్హతలు ఇవే..

అర్హతలు ఇవే..

ఎవరైనా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందేందుకు కొన్ని అర్హతలు ఉన్నాయి. ముందుగా దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించటం తప్పనిసరి. బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు తప్పక నిండి ఉండాలి. మధ్యవర్తులు, లంచాలకు ఎలాంటి తావు లేకుండా నేరుగా అర్హుల ఖాతాలకు డబ్బు ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వం బీసీ కులాంతర వివాహాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించగా వైసీపీ ప్రభుత్వం రూ.75 వేలు అందిస్తోంది.

స్కీమ్ ఎవరికి వర్తించదు..

స్కీమ్ ఎవరికి వర్తించదు..

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు స్కీమ్ వర్తించదు. అయితే ప్రభుత్వ పారిశుద్య కార్మికులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. దీనికి తోడు ఎవరైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హాలు. అలాగే నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారు సైతం ఈ పథకం పొందలేరు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, సిటీల్లో 1000 చదరపు అడుగుల నిర్మాణ ఆస్తి ఉండేవారు సైతం అనర్హులుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

English summary

YSR Kalyanamasthu: YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా నిధుల విడుదల.. బటన్ నొక్కిన సీఎం జగన్ | AP CM Jagan Released YSR Kalyanamasthu, YSR Shadi tofa Scheme funds to Beneficiaries

AP CM Jagan Released YSR Kalyanamasthu, YSR Shadi tofa Scheme funds to Beneficiaries
Story first published: Friday, February 10, 2023, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X