For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PNB scam: ఆంటిగ్వా నుండి క్యూబాకు పారిపోయిన మెహుల్ చోక్సీ

|

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కేసులో ట్విస్ట్. ప్రధాన నిందితుల్లో చోక్సీ ఒకరు. ఆయన ఆచూకీ ఇంత వరకు తెలియరాలేదు. స్కాం వెలుగులోకి రాకముందే భారత్‌ను విడిచి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా - బార్బుడా దేశంలో ఉంటున్న ఆయన ఆదివారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయాడు. అయితే అతడు ప్రస్తుతం క్యూబా పారిపోయి ఉంటాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చోక్సీని భారత్‌కు అప్పగించే విషయమై ఆంటిగ్వా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అతను దేశం విడిచి పారిపోయాడని తెలుస్తోంది.

తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించిన బంగ్లాదేశ్తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించిన బంగ్లాదేశ్

అక్కడా చోక్సీకి ఆస్తులు

అక్కడా చోక్సీకి ఆస్తులు

ఆదివారం ఓ రెస్టారెంట్లో విందు కోసం చోక్సీ తన ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు ఆంటిగ్వా మీడియా కథనాలు వెల్లడించాయి. అదేరోజు సాయంత్రం పోలీసులు అథడి కారును జాలీ హార్బర్ నుండి సముద్ర మార్గంలో క్యూబా వెళ్లి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూబాలోను చోక్సీకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 2018 మార్చి నెలలో PNB స్కాం వెలుగు చూసింది. అయితే అప్పటికే స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్, చోక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు.

అందుకే పారిపోయాడు..

అందుకే పారిపోయాడు..

2017లోనే చోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకొని మూడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. చోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్ కోరితే ప్రారంభంలో ఆంటిగ్వా అంగీకరించలేదు. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా అతనికి పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపింది. కానీ ఇటీవల భారత్ నుండి ఒత్తిడి పెరగడంతో చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వా దేశాన్ని విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.

సెర్చ్ ఆపరేషన్

సెర్చ్ ఆపరేషన్

ఆంటిగ్వా ప్రభుత్వం మెహుల్ చోక్సీ గురించి సెర్చ్ చేస్తోంది. ఇందుకోసం చోక్సీ ఫోటోను విడుదల చేయడంతో పాటు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మెహుల్ చోక్సీపై భారత్‌లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అతడి పైన ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు నీరవ్ మోడీ లండన్‌లో అరెస్టయ్యాడు. భారత్‌కు అప్పగించేందుకు దాదాపు మార్గం సుగమమైంది.

English summary

PNB scam: ఆంటిగ్వా నుండి క్యూబాకు పారిపోయిన మెహుల్ చోక్సీ | Antigua government releases Mehul Choksi's photo, launches search operation

Mehul Choksi - the 62-year-old fugitive diamantaire wanted by the CBI and Enforcement Directorate in connection with ₹ 14,000 crore PNB loan fraud and money-laundering case - has gone missing in the Caribbean island nation of Antigua and Barbuda, to which he fled in 2018.
Story first published: Tuesday, May 25, 2021, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X