For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్లలో సగానికి తగ్గిన ట్యాక్స్: పన్నులో తేడాలొద్దు.. 15% తగ్గించండి

|

కార్పోరేట్ పన్ను ఒకేరీతిన ఉండాలని, అన్నింటిని 15 శాతానికి తీసుకు రావాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కోరుతోంది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎలాంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు లేకుండా అన్ని కార్పోరేట్ ట్యాక్స్ రేట్లను పదిహేను శాతానికి పరిమితం చేస్తామని వచ్చే బడ్జెట్‌లో ప్రకటిస్తే పెట్టుబడి నిర్ణయాలుకు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతోంది. ఈ నిర్ణయం తీసుకుంటే సెంటిమెంట్ పెరిగి, మరిన్ని పెట్టుబడులు వస్తాయని సీఐఐ అధ్యక్షులు విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు.

HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలుHDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు

వివిధ పన్ను రేట్లు కారణం

వివిధ పన్ను రేట్లు కారణం

CII ప్రకారం కార్పోరేట్ పన్ను తగ్గింపులు లేదా ప్రోత్సాహకాలు అంత సంతృప్తికరంగా లేవు. మ్యానుఫ్యాక్చరింగ్, సేవా రంగాల్లో ట్యాక్స్ రేటు అసమానతలకు వివిధ పన్ను రేట్లు ఉండటం కూడా ఒక కారణంగా అభిప్రాయపడింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి గత ఏడాది చివరలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించి 22 శాతానికి పరిమితం చేసింది.

పెట్టుబడులు వస్తాయి

పెట్టుబడులు వస్తాయి

పన్ను రేట్లు తక్కువ ఉంటే పెట్టుబడి భారం తగ్గుతుందని, ప్రోత్సాహం పెరిగి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతాయని కిర్లోస్కర్ చెప్పారు. 2023కల్లా ఒకే కార్పొరేట్‌ పన్నును అమల్లోకి తెస్తామని ప్రకటిస్తే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చే వీలుంటుందన్నారు.

కొత్త సంస్థలకు కార్పోరేట్ ట్యాక్స్ భారీ తగ్గింపు

కొత్త సంస్థలకు కార్పోరేట్ ట్యాక్స్ భారీ తగ్గింపు

2019లో కార్పొరేట్ పన్ను రేట్లను కేంద్రం 22% తగ్గించింది. ఎలాంటి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు సంస్థలకు లేకుండా ఉంది. 2019 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీలోగా ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు కార్పోరేట్ పన్ను 15% మాత్రమే ఇచ్చింది మోడీ ప్రభుత్వం. దీనికి సర్‌ఛార్జ్, సెస్ అదనం.

వీటిని వదులుకోవాలి

వీటిని వదులుకోవాలి

కార్పోరేట్ ట్యాక్స్ 1991-95 మధ్య 45 శాతంగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 30 శాతం నుంచి ఇది 22 శాతానికి దిగి వచ్చింది. గత ఏడాదే భారీగా తగ్గించింది. కంపెనీలు దీనిని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలు వదులుకోవాలి.

దేశీయ కంపెనీలకు ఊతం

దేశీయ కంపెనీలకు ఊతం

ప్రభుత్వం తగ్గించిన కార్పోరేట్ కారణంగా... పలు దేశాలకు దీటుగా పోటీ పడేందుకు భారతీయ సంస్థలకు తాజా రేట్లు ఎంతగానో ప్రయోజనకరం. క్రమంగా పెట్టుబడుల వ్యయం తగ్గించుకునేందుకు, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడతాయి.

English summary

30 ఏళ్లలో సగానికి తగ్గిన ట్యాక్స్: పన్నులో తేడాలొద్దు.. 15% తగ్గించండి | Announce Convergence of All Corporate Tax Rates to 15 percent in Budget

The Confederation of Indian Industry has urged the Centre to converge multiple corporate tax rates to 15 per cent by April 2023 without any exemptions, and make the announcement in the upcoming Budget to facilitate investment decisions.
Story first published: Monday, January 20, 2020, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X