For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anil Ambani: తమ్ముడి వ్యాపారాన్ని దక్కించుకున్న అన్న.. విక్రయానికి మరో అనీల్ కంపెనీ..!

|

Anil Ambani: ఎన్నళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ విక్రయం పూర్తయింది. కంపెనీ ఆస్తులను దక్కించుకున్నది ఎవరో కాదు సోదరుడు ముఖేష్ అంబానీ కావటం విషేషం. దీంతో జియో అనుబంధ రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రోపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ చేతికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఆస్తులు చేరుకున్నాయి.

100 శాతం డీల్ పూర్తి..

100 శాతం డీల్ పూర్తి..

అనిల్ అంబానీకి చెందిన టవర్స్ అండ్ ఫైబర్ ఆస్తులను 100 శాతం వాటాను రూ.3,720 కోట్లకు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎట్టకేలకు దక్కించుకుంది. ఇందుకోసం జియో అనుబంధ సంస్థ డబ్బును ప్రత్యేక ఎస్బీఐ ఎస్క్రో అకౌంట్లోకి జమ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 43,540 మెుబైల్ టవర్లతో పాటు 1.78 లక్షల కిలోమీటర్లు పొడవైన ఫైబర్ ఆస్తులు జియో వశం చేసుకుంది.

 రిలయన్స్ నావల్ డిఫెన్స్..

రిలయన్స్ నావల్ డిఫెన్స్..

అనిల్ అంబానికి చెందిన అనేక కంపెనీలు లిక్విడిటీ ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ కంపెనీలను దక్కించుకునేందుకు చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ నావల్ డిఫెన్స్ & ఇంజనీరింగ్ వ్యాపారాన్ని కొనుగోలుకు హాజెల్-స్వాన్ కన్సార్టియం ప్రపోజ్ చేసిన ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ను అంగీకరించింది.

అహ్మదాబాద్ ప్రత్యేక బెంచ్ ఈ రోజు ఆమోదాన్ని తెలిపింది. ఇదే క్రమంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసిన అప్పీళ్లను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. రిలయన్స్ నావల్‌కు చెందిన దాదాపు 95 శాతం రుణదాతలు అనుకూలంగా ఓటు వేయడంతో హాజెల్ మర్కంటైల్ కన్సార్టియం రిజల్యూషన్ ప్లాన్ ఇప్పటికే ఆమోదించబడింది.

జియో చేతికి IOC నిర్వహణ..

జియో చేతికి IOC నిర్వహణ..

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో రిలయన్స్ జియో జతకట్టింది. ఐవోసీ పెట్రోల్ బంకులకు అవసరమైన నెట్‌వర్క్‌ సర్వీసుల నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ జియా చేతికి దక్కాయి. దీంతో కంపెనీకి చెందిన 20 శాతం అంటే దాదాపు 7,200 పెట్రోల్ బంకులకు అవసరమైన నిర్వహణ సేవలను రిలయన్స్ జియో అందించనుంది.

చెల్లింపుల ప్రాసెసింగ్‌, రోజువారీ ధరల్లో మార్పులు, రిమోట్‌ డెస్క్‌టాప్‌ ప్రొటోకాల్‌ సాఫ్ట్‌వేర్‌, నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, సేవల నాణ్యత వంచి సేవలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్ల విషయంలో జరుగుతున్న అతిపెద్ద డీల్ ఇది.

English summary

Anil Ambani: తమ్ముడి వ్యాపారాన్ని దక్కించుకున్న అన్న.. విక్రయానికి మరో అనీల్ కంపెనీ..! | Anil ambanies Telecom Towers Business Bought By Mukesh ambanies Reliance Jio

Anil ambanies Telecom Towers Business Bought By Mukesh ambanies Reliance Jio
Story first published: Friday, December 23, 2022, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X