For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుల కుప్పలు, అన్ని సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్న అనిల్ అంబానీ

|

అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి బ్యాంకులు షాకిస్తున్నాయి. తమ రుణ బకాయిలు వసూలు చేసుకునేందుకు ఆస్తుల అమ్మకానికి సిద్ధం అవుతున్నాయని వార్తలువచ్చాయి. కాగా, తాజాగా, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లోని రిలయన్స్ క్యాపిటల్(RCL) తన అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల నుండి బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది. వాటాల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో రూ.20వేల కోట్ల రుణాలు చెల్లించనున్నట్లు తెలిపింది. మొత్తం వాటాలకు గానీ లేదంటే అనుబంధ సంస్థలైన రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్, రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్‌లో కొంత భాగం వాటాల కోసం బిడ్స్‌ను ఆహ్వానించింది.

Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది..Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది..

ఈ సంస్థల్లో వాటాల విక్రయం

ఈ సంస్థల్లో వాటాల విక్రయం

2020 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రూ.252 కోట్ల చెల్లించిన పెయిడప్ క్యాపిటల్‌తో తమ పూర్తి ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీతో పాటు 51 శాతం వాటా కలిగి ఉన్న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీని విక్రయించాలని RCL భావిస్తోంది. జపాన్ నిప్పోన్ లైఫ్‌తో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. 2020 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఈ కంపెనీ చెల్లించిన మూలధనం రూ.1,196 కోట్లు. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల వ్యాల్యూ రూ.21,912 కోట్లు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

వీటిలో వంద శాతం వాటా విక్రయం

వీటిలో వంద శాతం వాటా విక్రయం

రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్స్‌లలో వందశాతం వాటాలను విక్రయించేందుకు RCL సిద్ధపడింది. రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పీఈ పెట్టుబడులపై నఫా ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, పేటీఎం ఈ-కామర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నుండి బయటకు వచ్చేందుకు ఆలోచన చేస్తోందట. రిలయన్స్ అసెట్ రీకన్స్ర్టక్షన్ లిమిటెడ్‌లో 49 శాతం వాటాని విక్రయించాలని చూస్తోంది. 2020 సెప్టెంబర్ 30 నాటికి సంస్థ నిర్వహణలో దాదాపు రూ.2,000 కోట్ల పోర్ట్‌పోలియో ఉంది. ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజీలో RCLకు ఉన్న 20 వాటాను కూడా విక్రయించనుంది.

బిడ్స్‌కు ఆహ్వానం

బిడ్స్‌కు ఆహ్వానం

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 31వ తేదీ నుండి బిడ్స్‌ను ఆహ్వానించాయి అనిల్ అంబానీ సంస్థలు. ఆగస్ట్ 31వ తేదీ నాటికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, వడ్డీ కలిపి RCLకు రూ.20వేలకోట్ల వరకు రుణాలు ఉన్నాయి. అనిల్ అంబానీ సంస్థలకు ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, చైనాకు చెందిన మూడు బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.

English summary

అప్పుల కుప్పలు, అన్ని సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్న అనిల్ అంబానీ | Anil Ambani's Reliance Capital invites bids for stake sale in subsidiaries

Anil Ambani-led Reliance Capital has invited bids to sell stakes in its subsidiaries, including Reliance General Insurance and Reliance Nippon Life Insurance, so as to clear dues worth nearly Rs 20,000 crore. The process to invite expressions of interest (EOI) began on October 31 this year so as to raise capital for making Reliance Capital Limited (RCL) debt free, news agency PTI reported.
Story first published: Tuesday, November 3, 2020, 17:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X