For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anand Mahindra: ఆశీర్వాదం కోరిన కస్టమర్.. ఆనంద్ మహీంద్రా రిప్లై.. వ్యాపారవేత్త సింప్లిసిటీకి అందరూ ఫిదా..

|

Anand Mahindra: మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ప్రేరణాత్మకమైన, ఆలోచింపజేసే పోస్టులను తన ట్విట్టర ఖాతాలో పంచుకుంటుంటారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో పాటు అనేకమంది నుంచి మన్ననలు పొందుతోంది.

10 ఏళ్ల కష్టంతో..

దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తనను ఆశీర్వదించాలంటూ ఒక వినియోగదారుడు సోషల్ మీడియా వేదికగా కోరాడు. 10 ఏళ్లు కష్టపడి చివరికి కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుగోలు చేశానంటూ అతను తన ట్వీట్ లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన మహీంద్రా మాటలు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంది.

ఆనంద్ మహీంద్రా సమాధానం ఇలా..

ఆనంద్ మహీంద్రా సమాధానం ఇలా..

కస్టమర్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ఇలా సమాధానమిచ్చారు.. "ధన్యవాదాలు, మహీంద్రా వాహనాన్ని మీ ఎంపికగా మార్చుకోవటం ద్వారా మమ్మల్ని మీరే ఆశీర్వదించారు" అంటూ బదులిచ్చారు. తన వ్యాపార దక్షతను, కృతజ్ఞతను మహీంద్రా ఇక్కడ చూపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అశోక్ కుమార్ అనే వినియోగదారుడిని అభినందనలు తెలుపుతూ.. 'హ్యాపీ మోటరింగ్' గ్యాగ్ తో మీ హార్డ్ వర్క్ వల్లే మీరు ఈ విజయం సాధించారంటూ కొనియాడారు.

పోస్ట్‌పై వినియోగదారుల స్పందనలు..

పోస్ట్‌పై వినియోగదారుల స్పందనలు..

కొత్త SUV కొనుగోలు చేసిన వినియోగదారుడిని మహీంద్రా ప్రశంశించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్‌కి దాదాపు 16,000 లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతుండగా.. మరొక ఫాలోవర్ ప్రతి భారతీయుడు ఆనంద్ మహీంద్రా లాగా ఉంటే బాగుంటుంది కదా అంటూ కామెంట్ చేశాడు.

English summary

Anand Mahindra: ఆశీర్వాదం కోరిన కస్టమర్.. ఆనంద్ మహీంద్రా రిప్లై.. వ్యాపారవేత్త సింప్లిసిటీకి అందరూ ఫిదా.. | anand mahindra reply to suv customer who asked for a blessing which was bought with 10 years of hard work going viral in twitter

anand mahindra reply to suv customer who asked for a blessing going viral
Story first published: Wednesday, August 3, 2022, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X