గుడ్‌న్యూస్: మోడర్నా-సిప్లా వ్యాక్సీన్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్, ఈ మినహాయింపులివ్వండి..
అమెరికా ఔషధ సంస్థ మోడర్నా తయారు చేసిన కోవిడ్ 19 సింగిల్ డోస్ బూస్టర్‌ను భారత్‌లోకి తీసుకు వస్తామని, దానికి సత్వరం అనుమతులు ఇవ్వాలని సిప్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రధానంగా నాలుగు మినహాయింపులు కోరింది. సిప్లా-మోడర్నా జత కట్టడంపై మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా స్పందించారు.
కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించి ఇది నిజంగా అద్భుత వార్త అని, సిప్లా, మోడర్నా సంస్థలకు ప్రభుత్వం వేగంగా అనుమతులు, మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నానని, ప్రపంచంలో పలు రకాల కంపెనీల నుండి వ్యాక్సిన్‌లు రావడం శుభపరిణామమని, సిప్లా వంటి దిగ్గజ కంపెనీల సాయంతోనే కొవిడ్ మూడో దశ మాత్రమే కాకుండా భవిష్యత్ పరిణామాలను ఎదుర్కోగలమని ఆనంద్ మహీంద్రా అన్నారు.

కాగా, మోడర్నా సింగిల్ బూస్టర్‌ను భారత్‌లోకి తీసుకు రావడానికి సిప్లా కేంద్రం ముందు పలు కోరికల చిట్టా ఉంచింది. దిగుమతి సుంకాన్ని మినహాయించాలని, ఈ వ్యాక్సీన్ వల్ల ఎవరికైనా ఏదైనా నష్టం జరిగితే తమ కంపెనీకి సంబంధం లేదని, బాధితులకు నష్టపరిహారం మాత్రం ఇవ్వమని,
విదేశీ టీకాలకు భారత్‌లో ట్రయల్స్ నిర్వహించాలనే నిబంధన నుండి వెసులుబాటు కల్పించాలని కోరింది. అంతేకాదు, వ్యాక్సీన్ ధరను తామే నిర్ణయిస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications