For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC SIIP: నెలకు రూ.4 వేలతో.. 21 సంవత్సరాల్లో రూ.35 లక్షలు..

|

ఇన్సూరెన్స్ అంటే గుర్తుకు వచ్చేది ఎల్ఐసీ.. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యంత నమ్మదగిన సంస్థల్లో ఇది ఒకటి. అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ పెట్టుబడి దారులు ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతుంటారు. ఈ ఎల్‌ఐసీలో చాలా వరకు ఆదాయం వచ్చే పథకాలు ఉన్నాయి.

రూ.40,000

రూ.40,000

ఇందులో చాలా పథకాలు పన్ను ఆదాలో కూడా ఉపయోగపడతాయి. మీరు LIC ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు LIC రెగ్యులర్ ప్రీమియం యూనిట్ లింక్డ్ ప్లాన్ SIIPలో పెట్టుబడి పెట్టవచ్చు. LIC ఈ పథకంలో 21 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 40,000 పెట్టుబడి మెచ్యూరిటీపై 3 రెట్లు మొత్తాన్ని అందిస్తుంది.

21 సంవత్సరాలు

21 సంవత్సరాలు

ఈ క్రమబద్ధమైన పెట్టుబడి బీమా పథకం SIIP పెట్టుబడిదారులకు 21 సంవత్సరాల పాటు ప్రీమియంలను చెల్లిచాల్సి ఉంటుంది. మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్థ వార్షికంగా, వార్షికంగా చెల్లించవచ్చు. మీరు మీ ప్రాధాన్యత ప్రకారం దీన్ని ఎంచుకోవచ్చు.మీరు ప్రతి సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తే రూ.40,000 చెల్లించవచ్చు.

రూ.10,08,000

రూ.10,08,000

అర్ధ సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తే 22,000 చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికంగా అయితే 12,000 చెల్లించాలి. నెలనెలా చెల్లించాలనుకంటే రూ.4000 కట్టాలి. మీరు మొత్తం ప్రీమియం చెల్లించినప్పుడు తక్కువ అవుతుంది. ఇక రోజుల లెక్కను చూస్తే మీరు రోజుకు సుమారు 133 రూపాయలు సేవే చేస్తే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు 21 సంవత్సరాల పాటు నెలకు రూ.4000 చెల్లిస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ.10,08,000 అవుతుంది. 21 ఏళ్ల తర్వాత 35 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది.

రూ. 4,80,000 బీమా

రూ. 4,80,000 బీమా

SIIP పథకం కింద, ఇది పెట్టుబడిదారులకు రూ. 4,80,000 బీమా రక్షణను కూడా అందిస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ (SIIP)లో పెట్టుబడిదారులు 21 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. ఈ పథకం NAV రేటు LIC వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పడు అప్ డేట్ అవుతుంది. మొత్తం మీద, మీరు ఈ పథకంలో బీమా, పెట్టుబడి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పథకంలో బీమా చాలా తక్కువగా ఉంది.

ఇన్సూరెన్స్, పెట్టుబడి

ఇన్సూరెన్స్, పెట్టుబడి

లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనకునే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ పెట్టుబడిగా చూడొద్దని వారు సూచిస్తున్నారు. ఇన్సూరెన్స్ ను పెట్టుబడిగా చూసినప్పుడు మీకు బీమా మొత్తం తగ్గుతుందని గుర్తుంచుకోండి.

Note: ఈ వార్త కేవలం సమచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీరు ఏదైనా పాలసీ కొనుగోలు చేయాలనుకంటే నిపుణులను సంప్రదించగలరు.

English summary

LIC SIIP: నెలకు రూ.4 వేలతో.. 21 సంవత్సరాల్లో రూ.35 లక్షలు.. | An investment of Rs.4 thousand per month can earn Rs.35 lakhs in 21 years

LIC comes to mind because Life Insurance Corporation of India is one of the most reliable companies. But now there are many companies regarding insurance.
Story first published: Saturday, December 17, 2022, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X