NDTVని అదాని గ్రూప్ టేకోవర్ చేస్తోందా.. ఒక్కసారిగా పెరిగిన షేరు ధర..వివరాలివే..!!
ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ మీడియా హౌజ్ ఎన్డీటీవీని అదాని గ్రూప్ టేకోవర్ చేస్తోందన్న వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో ఎన్డీటీవీ షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం రోజున ఎన్డీటీవీ షేర్ల ర్యాలీ మంచి జోష్‌తో కొనసాగింది. 10శాతం మేర కంపెనీ షేర్లలో వృద్ధి నమోదు చేసుకుంది. అయితే న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ మీడియా హౌజ్‌ను అదానీ గ్రూపు కొనుగోలు చేస్తోందన్న వార్తలు రావడంతో అది ఎన్డీటీవీ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ యొక్క స్టాక్ ప్రైస్ 10శాతం మేరా పెరిగింది.
అదానీ గ్రూప్ ఎన్డీటీవీని టేకోవర్ చేస్తోందన్న వార్తలు రావడంతో మదుపరులు ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే దీనిపై ఇటు ఎన్డీటీవీ నుంచి కానీ అటు అదాని గ్రూప్ సంస్థల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రెండు రోజుల క్రితం తమ మీడియా కమ్యూనికేషన్స్ కోసం మీడియా రంగంలో, డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం గడించిన సంజయ్‌ను సీఈఓ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా నియమిస్తూ ఓ అధికారిక ప్రకటన అదానీ సంస్థ విడుదల చేసింది. సంజయ్ గతంలో క్వింట్ డిజిటల్ మీడియా ప్రెసిడెంట్, ఎడిటోరియల్ డైరెక్టర్‌గా సేవలందించారు.
అంతకుముందు CNBC-Aawazకు నాయకత్వం వహించారు. స్టార్ న్యూస్, జీ న్యూస్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇక ఆజ్‌తక్ వ్యవస్థాపక బృందంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు. బిజినెస్ స్టాండర్డ్ నవభారత్ టైమ్స్‌తో ప్రింట్ జర్నలిస్ట్‌గా పనిచేయడమే కాకుండా బీబీసీ హిందీ రేడియోకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్‌గా కూడా ఉన్నారు.

సంజయ్‌కు తమ సంస్థలో అదానీ గ్రూప్ కీలక బాధ్యతలను కట్టబెట్టడంతో కచ్చితంగా అదానీ సంస్థ మీడియా రంగంలోకి అడుగుపెడుతుందన్న వార్తలు బలపడ్డాయి. అదే సమయంలో ఢిల్లీలోని ఓ వార్తా ఛానెల్‌ను టేకోవర్ చేసేందుకు చర్చలు జరుపుతోందన్న ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ స్టాక్ 9.94శాతం అధికంతో రూ. 79.65తో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఎన్డీటీవీ ఆర్థిక పరిస్థితి కూడా పేలవంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కంపెనీ ప్రమోటర్లు కూడా దీనిపై అంత ఆసక్తి కనబర్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది కాలంలో కంపెనీ స్టాక్ మాత్రం 130శాతం లాభ పడింది.
అదానీ గ్రూప్ తన వ్యాపారాన్ని అనేక ప్రాంతాల్లో విస్తరించింది. ఈ గ్రూపులోని ప్రధాన కంపెనీలు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ (APSEZ) మరియు అదానీ పవర్. గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోని టాప్ -5 సంపన్నుల జాబితాలో నిలిచారు. ఆయన సంపద దాదాపు 67.1 బిలియన్ డాలర్లుగా ఉంది.