For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ 'తాత్కాలిక' గుడ్‌న్యూస్: 50,000 కొత్త నియామకాలు

|

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'తాత్కాలిక' గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ - లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది ఆన్‌లైన్ ద్వారా నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. చాలా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ-కామర్స్ సంస్థలకు డిమాండ్ పెరిగి, తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంటున్నారు. తాజాగా, అమెజాన్ ఇండియా ఈ మేరకు ప్రకటన చేసింది.

 ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల

50వేల తాత్కాలిక ఉద్యోగాలు

50వేల తాత్కాలిక ఉద్యోగాలు

ఆన్‌లైన్ ఆర్డర్స్‌కు డిమాండ్ పెరిగిందని, దీంతో భారతదేశంలో డెలివరీ నెట్ వర్క్‌ను పెంచుకునే క్రమంలో భాగంగా తాత్కాలికంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 50,000 సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని జోన్లలో అన్ని వస్తువుల డెలివరీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగులను తీసుకోనుంది.

డిమాండ్ పెరగడంతో..

డిమాండ్ పెరగడంతో..

తాత్కాలిక ఉద్యోగులు ప్యాకింగ్ కోసం, రవాణా చేయడం కోసం, కస్టమర్లకు ఆర్డర్స్ అందించేందుకు ఇలా వివిధ విభాగాల్లో పని చేస్తారని అమెజాన్ తెలిపింది. ఆన్ లైన్ షాపింగ్‌కు భారీగా డిమాండ్ పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని 50వేల తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని వెల్లడించింది. ఆన్ లైన్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ సక్సేనా అన్నారు.

అమెజాన్ ఫ్లెక్స్ సర్వీస్‌తో పార్ట్ టైమ్

అమెజాన్ ఫ్లెక్స్ సర్వీస్‌తో పార్ట్ టైమ్

అమెజాన్ ఫుల్‌పిల్‌మెంట్ కేంద్రాలతోపాటు డెలివరీ నెట్ వర్క్‌లో తాత్కాలిక నియామకాలు చేపడతామన్నారు. ఇటీవల ప్రారంభించిన అమెజాన్ ఫ్లెక్స్ సర్వీస్ ద్వారా కార్మికులకు సౌకర్యవంతమైన పార్ట్ టైమ్ పనికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

 జొమాటో, స్విగ్గీకి పోటీగా..

జొమాటో, స్విగ్గీకి పోటీగా..

ఇదిలా ఉండగా, జొమాటో, స్విగ్గీలకు పోటీగా అమెజాన్ ఇండియా ఫుడ్ డెలివరీ సేవలు కూడా ప్రారంభించింది. తొలుత బెంగళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. గత కొద్ది నెలలుగా ప్రయోగాత్మకంగా దీనిని చేపడుతోంది. అమెజాన్ షాపింగ్‌తో పాటు తినేందుకు సిద్ధంగా ఉంచిన ఆహారం కోసం ఆర్డర్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తమ కస్టమర్ల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రస్తుతం వారు ఇళ్లలో ఉండాలంటే ఈ సేవలు ముఖ్యమని, స్థానిక వ్యాపారులకు కూడా అండగా ఉంటుందని అమెజాన్ ఇండియా తెలిపింది. బెంగళూరులోని మహాదేవపుర, మరతల్లి, వైట్ ఫీల్డ్, బెలాందూర్లలో వందకు పైగా రెస్టారెంట్ల నుండి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

English summary

అమెజాన్ 'తాత్కాలిక' గుడ్‌న్యూస్: 50,000 కొత్త నియామకాలు | Amazon to hire for 50,000 temporary jobs

Amazon has announced that it is creating 50,000 seasonal job opportunities across its fulfilment and delivery networks in India to meet the surge in demand for online ordering, soon after the government allowed e-commerce firms to ship all products across the country, except in containment zones.
Story first published: Friday, May 22, 2020, 20:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X