For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త రికార్డ్: ఒక్కరోజులో రూ.లక్ష కోట్లు పెరిగిన జెఫ్ బెజోస్ సంపద! భార్య ఆస్తి కూడా..

|

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 బిలియన్ డాలర్లు లేదా రూ.97 వేల కోట్లకు పైగా పెరిగింది. 2012లో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వచ్చిన తర్వాత నుండి ఇండివిడ్యువల్ జాబితాలో రికార్డ్‌స్థాయిలో పెరగడం ఇదే కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో అమెజాన్ షేర్లు దూసుకెళ్తున్నాయి. డిసెంబర్ 2018 తర్వాత మొదటిసారి 7.9 శాతం ఎగిశాయి. ప్రపంచంలోనే కుబేరుడైన జెఫ్ ఆస్తులు 189.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

భారీగా పెరిగిన జెఫ్, మాజీ భార్య ఆస్తులు

భారీగా పెరిగిన జెఫ్, మాజీ భార్య ఆస్తులు

జెఫ్ బెజోస్ సంపద కేవలం 2020లోనే అంటే ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 74 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో 189 బిలియన్ డాలర్లు దాటింది. జూలై 20 (నిన్న) అమెజాన్ షేర్లు 7.9 శాతం ఎగిశాయి. ఈ ఏడాది 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ బెజోస్ ఆస్తులు 4.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. అమెజాన్‌లో ఆమెకు వాటాలు ఉన్నాయి. దీంతో వరల్డ్ 13వ రిచ్చెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ఈ ఏడాది ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 15 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తులు 13.5 బిలియన్ డాలర్లు పెరిగాయి.

అందుకే పెరుగుదల

అందుకే పెరుగుదల

వెబ్ షాపింగ్ ట్రెండ్స్ పైన అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సోమవారం అమెజాన్ షేర్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రముఖ రేటింగ్ సంపద గోల్డ్‌మెన్ శాక్స్ అమెజాన్ షేరుకు గతంలో కేటాయించిన బై రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను 3,100డాలర్ల నుంచి 3,800డాలర్లకు పెంచింది. అమెజాన్ షేర్ ధర పెరగడంతో ఫలితంగా జెఫ్ బెజోస్ సంపద ఎగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లు అప్

అంతర్జాతీయ మార్కెట్లు అప్

మరోవైపు, ఆటుపోట్ల మధ్య అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 9 పాయింట్లు మాత్రమే లాభపడి 26,681 వద్ద నిలిచింది. ఎస్ అండ్ పీ 27 పాయింట్లు ఎగిసి 3,252 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్ 264 పాయింట్లు పెరిగి 10,767 వద్ద క్లోజ్ అయింది. నాస్‌డాక్ రికార్డ్ పెరుగుదలకు ప్రధానంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ కారణం. వ్యాక్సీన్ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఫార్మా షేర్లు దూసుకెళ్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లకు కూడా ఇది ప్రయోజకరంగా మారింది. బ్లూచిప్స్ షేర్లు అమెజాన్ 7.9 శాతం, మైక్రోసాఫ్ట్ 4.3 శాతం, ఐబీఎం 5 సాతం, టెస్లా ఇంక్ 9.5 శాతం ఎగిశాయి. నోబుల్ ఎనర్జీ 5.4 శాతం పెరిగింది. ఆశియా మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. చైనా మార్కెట్ యథాతథంగా ఉంది.

English summary

సరికొత్త రికార్డ్: ఒక్కరోజులో రూ.లక్ష కోట్లు పెరిగిన జెఫ్ బెజోస్ సంపద! భార్య ఆస్తి కూడా.. | Amazon's Jeff Bezos adds record $13 billion to his fortune in single day

Jeff Bezos added $13 billion to his net worth on July 20, according to the Bloomberg Billionaires Index, after Amazon's shares surged amid rising optimism on online shopping.
Story first published: Tuesday, July 21, 2020, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X