ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా రానున్న పండుగ సీజన్ కు దూసుకుపోయే కొత్త ప్లాన్ తో సిద్ధమవుతోంది. ఐదు కొత్త సార్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి త్వరితగతిన కస్టమర్లకు కావలసిన ప్రొడక్ట్స్ ను అందించనుంది. ఐదు కొత్త కేంద్రాలతో తన సార్టింగ్ సెంటర్ నెట్ వర్క్ ను విస్తరించనుంది. ఇక ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

5 కొత్త సార్టింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్న అమెజాన్
వినియోగదారులకు ఫాస్ట్ డెలివరీ ఇచ్చే విధంగా తమ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. విశాఖపట్నం, బెంగళూర్, అహ్మదాబాద్, ఫరూక్ నగర్, ముంబైలో ఈ సెంటర్లను ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న 8 సార్టింగ్ సెంటర్లను కూడా విస్తరించనున్నట్లు గా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. ఈ సార్టింగ్ సెంటర్ల ద్వారా అమెజాన్ కస్టమర్ల ప్యాకేజీలను సమీకరించడంలో కీలకంగా వ్యవహరించనుంది. స్థానిక డెలివరీ స్టేషన్ నుండి వినియోగదారులకు అందించడానికి ఈ సార్టింగ్ సెంటర్లు వేగవంతంగా పనిచేస్తాయని తెలుస్తుంది.

నిరుద్యోగులకు ఉపాధి.. కస్టమర్లకు ఫాస్ట్ డెలివరీ సేవలు
కస్టమర్లకు ప్యాకేజీ స్థానం, రవాణా విధానం ఆధారంగా విభజించి సార్ట్ స్లైడ్స్ , ఆటో స్టార్టర్స్ టెక్నాలజీ ఆటోమేషన్ ద్వారా ఎండ్ టూ ఎండ్ సార్టింగ్ చేసి వేగంగా డెలివరీ చేయనున్నట్లుగా తెలిపింది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అమెజాన్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు. 2020 జూలైలో అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ నెట్వర్క్ ను కూడా విస్తరిస్తున్నట్లుగా ప్రకటించింది. అందులో భాగంగా కొత్తగా 10 సెంటర్ లతోపాటు అప్పటికే ఉన్న ఐదు భవనాల ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్ వర్క్ ను విస్తరిస్తున్న ట్లుగా వెల్లడించింది.

దేశ వ్యాపతంగా నెట్ వర్క్ విస్తరణలో అమెజాన్ ఇండియా
ఇప్పటికే ఉన్న సార్టింగ్ సెంటర్ ల విస్తరణతో పాటు కొత్త కేంద్రాల ఏర్పాటుతో అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాలలో మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెంచుతున్నట్లు గా తెలుస్తుంది. అమెజాన్ చేస్తున్న ఈ ప్రయత్నం అంతా వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించటానికి, అలాగే అమెజాన్ తన ఈ కామర్స్ సేవలను మరింత విస్తరించే ప్లాన్ గా తెలుస్తుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications