For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్‌తో వద్దు.. మేం తీసుకు వస్తాం: 'ఫ్యూచర్'కు అమెజాన్ బంపరాఫర్!

|

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)తో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని విరమించుకుంటే మరో బలమైన,స్థిరమైన పెట్టుబడిదారుని తీసుకురావడంలో ఫ్యూచర్ గ్రూప్‌కు సహకరిస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ రుణ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కానీ రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అమెజాన్ ద్వారా చిక్కులు వచ్చాయి.

ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు షాక్! సింగపూర్ ఆర్బిట్రేషన్‌కు లాగిన అమెజాన్ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు షాక్! సింగపూర్ ఆర్బిట్రేషన్‌కు లాగిన అమెజాన్

ఫ్యూచర్ గ్రూప్‌కు ఆఫర్

ఫ్యూచర్ గ్రూప్‌కు ఆఫర్

రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌తో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే కొత్త భాగస్వామిని తీసుకువస్తామని లేదా పెట్టుబడి సంస్థలను తీసుకువస్తామని ఫ్యూచర్ గ్రూప్‌కు అమెజాన్ ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. రుణ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు కొత్త వ్యూహాత్మక భాగస్వాములు, పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లను తీసుకొని రావడం ద్వారా ఇంతకుముందు కూడా ఫ్యూచర్ గ్రూప్‌కు అమెజాన్ సహకరించిందని చెబుతున్నారు.

కేసు వేసినప్పటికీ...

కేసు వేసినప్పటికీ...

ఫ్యూచర్ కూపన్స్ పైన కేసు వేసినప్పటికీ, కొత్త భాగస్వామిని తీసుకొని వచ్చి ఫ్యూచర్ గ్రూప్‌కు సహకరించేందుకు అమెజాన్ సిద్ధపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌ను ఆర్బిట్రేషన్‌కు లాగింది అమెజాన్. ఫ్యూచర్ గ్రూప్‌తో తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ విరుద్ధమని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను(SIAC) ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకుగాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్‌ను నిలుపుదల చేయాలని కోరింది. అయితే అమెజాన్ టార్గెట్... ఫ్యూచర్ గ్రూప్ కాదని, రిలయన్స్‌తో భాగస్వామ్యం దూరం చేయడమే అంటున్నారు.

అందుకే అమెజాన్‌ను ఆదుకోవడానికి..

అందుకే అమెజాన్‌ను ఆదుకోవడానికి..

ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడ‌లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. 2019లో దాదాపు రూ.1430 కోట్లను దీనిని కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల భారత్‌లో తమకు పోటీ మరింత ఎక్కువ అవుతుందనే భావన అమెజాన్‌లో ఉందని భావిస్తున్నారు. అందుకే ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదుకునేందుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary

రిలయన్స్‌తో వద్దు.. మేం తీసుకు వస్తాం: 'ఫ్యూచర్'కు అమెజాన్ బంపరాఫర్! | Amazon  open to bailing out  Future Group: Ready to play matchmaker in helping to replace Reliance

Amazon Inc. is open to helping debt-laden Future Group bring in a new, financially strong partner or investor if it calls off its ₹24,700 crore deal with Reliance Retail Ventures Ltd, said two people aware of the US e-commerce firm’s plans.
Story first published: Saturday, October 24, 2020, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X