For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ సహా 10 సిటీల్లో అమెజాన్ FCలు, కొత్తగా వేలాది ఉద్యోగాలు

|

హైదరాబాద్: ఇండియాలో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్(FC) విస్తరించనున్నట్లు అమెజాన్ ఇండియా గురువారం ప్రకటించింది. మొత్తం పది ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ కొత్తగా ఏర్పాటు చేయనున్నామని, ఏడింటిని విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఈ విస్తరణతో అమెజాన్.ఇన్ 15 రాష్ట్రాల్లో 60కి పైగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ కలిగి ఉంటుంది. మొత్తం నిల్వ సామర్థ్యం 32 మిలియన్ క్యూబిక్ ఫీట్లు ఉంటుంది.

గుడ్‌న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!గుడ్‌న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో...

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో...

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-కామర్స్ బిజినెస్ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో కొత్తగా FCలు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పాట్నా, లక్నో, కోల్‌కతా, చెన్నై, లుథియానా, అహ్మదాబాద్ నగరాల్లో కొత్తగా వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయనుంది. 80 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ వేర్ హోస్‌లు వంద ఫుట్‌బాల్ గ్రౌండ్స్ కంటే పెద్దదిగా ఉంటుంది.

ప్రతి వస్తువు అందించేందుకు సిద్ధం

ప్రతి వస్తువు అందించేందుకు సిద్ధం

ఓవైపు కరోనా, మరోవైపు పండుగలు సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తోంది. వీటిని దసరా పర్వదినం నాటికి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. భారత్‌లో పెట్టుబడులపై తమ దీర్ఘకాలిక నిబద్ధతకు ఇది నిదర్శనమని, కొనుగోలుదారులకు మరింతగా సేవలను విస్తృతపరచాలనే ఉద్దేశ్యంతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు అవసరమైన ప్రతి వస్తువును అందించేందుకు సిద్ధమన్నారు. లార్ట్ అప్లియెన్సెస్, ఫర్నీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వస్తుంది.

భారీ పెట్టుబడులు

భారీ పెట్టుబడులు

వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను మెరుగు పరుచడానికి కూడా భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. కొత్త వేర్ హౌస్‌ల ద్వారా వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వేర్‌హౌస్‌ల ద్వారా బుకింగ్ చేసుకున్న వస్తువును మరింత వేగంగా డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతోంది. అప్పుడు ఆర్డర్స్ మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు.

English summary

హైదరాబాద్ సహా 10 సిటీల్లో అమెజాన్ FCలు, కొత్తగా వేలాది ఉద్యోగాలు | Amazon India to open 10 new fulfilment centres, including Hyderabad

Amazon India on Thursday announced the expansion of its fulfillment network in India, with 10 new Fulfillment Centres (FC) and expansion of seven existing buildings.
Story first published: Friday, July 24, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X