For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోతో పోటీ: ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా! ఈ డీల్ కుదిరితే..

|

భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్ ఆసక్తి చూపిస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 2 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.15,000 కోట్లతో 5 శాతం వాటా దక్కించుకోవచ్చునని తెలుస్తోంది. భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఒప్పంద నిబంధనల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చునని చెబుతున్నారు. ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా కూడా చెప్పలేని చెబుతున్నారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా జియో-వొడాఫోన్ వైపు ఎందుకు చూస్తున్నారు?గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా జియో-వొడాఫోన్ వైపు ఎందుకు చూస్తున్నారు?

జియోకు పోటీగా..

జియోకు పోటీగా..

ఎయిర్‌టెల్‌కు 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. దేశంలో మూడో అతిపెద్ద టెలికం రంగ సంస్థ. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీగా నిలిచిన రిలయన్స్ జియోలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. జియోతో పోటీ పడేందుకు ఈ డీల్ ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌టెల్‌లో అవసరమైతే 8 శాతం నుండి 10 శాతం వాటాను కూడా కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎంత మేర పెట్టుబడులు పెట్టాలి, అందులో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను అమెజాన్ పరిశీలిస్తోంది.

ఆ ఒప్పందం లేకుంటే.. వాణిజ్యం

ఆ ఒప్పందం లేకుంటే.. వాణిజ్యం

ఎయిర్‌టెల్, అమెజాన్ మధ్య వాటా కొనుగోలు ఒప్పందం కుదరకుంటే ఈ రెండు కంపెనీలు వాణిజ్య ఒప్పందంపై దృష్టి సారించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే అమెజాన్ ఉత్పత్తులు ఎయిర్‌టెల్ కస్టమర్లకు చౌకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అంశాలపై రెండు కంపెనీలు ఇప్పుడే మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదట. వివిధ డిజిటల్ సంస్థల ఉత్పత్తుల్ని, కంటెంట్ సర్వీసుల్ని తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నామని, అంతకుమించి చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవని ఎయిర్‌టెల్ తెలిపింది.

అమెజాన్ ఏం చెప్పిందంటే

అమెజాన్ ఏం చెప్పిందంటే

'మేం సాధారణంగా అన్ని డిజిటల్, ఓటీటీ సంస్థలతో పని చేస్తుంటామని, వారి ఉత్పత్తులు, కంటెంట్, సేవల్ని మా కస్టమర్లకు అందిస్తూ అనుబంధాన్ని కలిగి ఉంటామని, అంతకుమించి ఏ పరిణామాలు లేవ'ని ఎయిర్‌టెల్ తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ సంప్రదింపులపై జరిగే లేదా జరగడానికి అవకాశం లేని ఊహాగానాల విషయంలో కంపెనీ స్పందించదని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు.

డీల్ కుదిరితే...

డీల్ కుదిరితే...

ఈ డీల్ కుదిరితే ఇది ఎయిర్‌టెల్‌కు కలిసి వచ్చే అంశమే అంటున్నారు. నాలుగైదేళ్ల క్రితం దేశంలో ఎయిర్‌టెల్ టెలికం రంగ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉండేది. జియో రావడం, వివిధ రకాల ఆఫర్లతో ముందుకు వెళ్లడంతో వెనుకబడింది. వొడాఫోన్ ఐడియా కలిసి పోవడంతో ఎయిర్ టెల్ మూడో స్థానానికి పడిపోయింది. క్రమంగా మార్కెట్ వాటాను కోల్పోయింది. ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులతో మరింత బలోపేతమవుతున్న జియోతో పోటీపడేందుకు ఎయిర్‌టెల్‌కు అమెజాన్ వంటి టెక్ దిగ్గజ పెట్టుబడులు అవసరమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

English summary

జియోతో పోటీ: ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా! ఈ డీల్ కుదిరితే.. | Amazon in talks to buy $2 billion stake in Bharti Airtel

Amazon is in early-stage talks to buy a stake worth at least $2 billion in mobile operator Bharti Airtel, three sources with knowledge of the matter told Reuters, underscoring the growing attraction of India's digital economy for U.S. tech giants.
Story first published: Friday, June 5, 2020, 8:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X