For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Layoffs: ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్.. ఈసారి ఇండియాలో భారీగా తొలగింపులు..!

|

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఉద్యోగులకు జలక్ మీద జలక్ ఇస్తోంది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ తాజాగా మరోసారి తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ లో దాదాపు 1,000 ఉద్యోగులను తొలగించాలని భావిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క Amazon ఇండియా కార్యాలయంలోనే దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తారని తెలుస్తోంది. అంతర్జాతీయ వ్యాపారంలో దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించాలని Amazon CEO నిర్ణయం తీసుకున్నారు.

ఆండీ జాస్సీ

ఆండీ జాస్సీ

జనవరి 5న ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, ప్రపంచంలోని ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ CEO ఆండీ జాస్సీ, జనవరి 18 నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. వ్యాపారం నిర్వహణ ఖర్చులు పెరగడంతో కార్మికులను తొలగించవలసి వస్తోందని ఆండీ జా వివరించారు.

18,000 మంది ఉద్యోగులు

18,000 మంది ఉద్యోగులు

నవంబర్‌లో అమెజాన్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు తొలగించింది కూడా. మాంద్యం కారణంగా 2023 ప్రారంభంలో 18,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 7% మంది భారతదేశంలో ఉన్నారు. భారత్ లోని అమెజాన్ కంపెనీలో పని చేస్తున్న 18,000 మంది ఉద్యోగులలో కనీసం 1,000 మంది ఉద్యోగం కోల్పోనున్నారు.

10,000 మంది ఉద్యోగులు

10,000 మంది ఉద్యోగులు

అమెజాన్ ఇండియా కేవలం ఇ-కామర్స్ మాత్రమే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ వీడియో వ్యాపారంలో ఉంది. అమెజాన్ గత నవంబర్ లో 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా కార్పొరేట్, టెక్నాలజీ విభాగాలలోని వారే. జనవరి 18న ప్రారంభమయ్యే ఉద్యోగుల తొలగింపులు చాలా వరకు అమెజాన్ స్టోర్స్, PXT విభాగాల నుంచి ఉంటాయని భావిస్తున్నారు.

వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్

వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్

అమెజాన్ ఇండియా మేనేజ్‌మెంట్ నవంబర్‌లో 300 నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ ఉద్యోగులను కేవలం 3-4 నెలల జీతం ఇచ్చి తొలగించే బదులుగా.. ఇది వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్ (VSP) అనే ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, ఉద్యోగులు స్వచ్ఛందంగా పథకాన్ని ఆమోదించడానికి మరియు వారి ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి అవకాశం ఉంటుంది.

స్వచ్ఛంద రాజీనామా

స్వచ్ఛంద రాజీనామా

ఈ పథకాన్ని అంగీకరించిన వారికి అనేక రాయితీలు కల్పించడం గమనార్హం. ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపు చట్టబద్ధంగా పలు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు అలాంటి సమస్య ఉండదు. అందువల్ల ఈసారి ఇలాంటి ప్రోగ్రామ్‌లను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary

Amazon Layoffs: ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్.. ఈసారి ఇండియాలో భారీగా తొలగింపులు..! | Amazon has decided to lay off 18,000 employees worldwide

Amazon, the world's largest e-commerce company, is giving employees jalak on jalak. This company, which has already dismissed some employees, has recently taken up the dismissal process once again.
Story first published: Saturday, January 7, 2023, 10:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X