For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Galla Jayadev: అదరగొట్టిన అమరరాజా: తొలి త్రైమాసికంలో లాభాలు డబుల్

|

ముంబై: అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్.. కొంతకాలంగా రాష్ట్రంలో వార్తల్లో ఉంటూ వస్తోన్న కంపెనీ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌కు చెందిన కంపెనీ కావడం వల్ల రాజకీయంగా దీని చుట్టూ రోజుకో వార్త వినిపిస్తోంది. తొలుత- పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత.. రాజకీయంగా ఏపీ ప్రభుత్వ వేధింపులు తీవ్రతరం అయ్యాయనే వార్తలొచ్చాయి.

Mahindra XUV700: న్యూ అవతార్: కళ్లు చెదిరే లుక్..అద్దిరిపోయే ఫీచర్స్: గ్రాండ్ రివీల్Mahindra XUV700: న్యూ అవతార్: కళ్లు చెదిరే లుక్..అద్దిరిపోయే ఫీచర్స్: గ్రాండ్ రివీల్

అనిశ్చితిలోనూ అదరగొట్టే రిజల్ట్..

అనిశ్చితిలోనూ అదరగొట్టే రిజల్ట్..

తదనంతరం.. ఇక ఈ ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలి పోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతూ వచ్చింది. ఈ తరహా ప్రచారానికి అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం తెర దించింది. తాము ఎక్కడికీ తరలి వెళ్లట్లేదంటూ తేల్చి చెప్పింది. అవన్నీ వదంతులు మాత్రమేనంటూ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం.. అదరగొట్టే ఫలితాలను సాధించింది. తొలి త్రైమాసికంలో తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది.

ఆదాయం రెట్టింపు..

ఆదాయం రెట్టింపు..

ఈ మధ్యాహ్నం ఆ కంపెనీ మేనేజ్‌మెంట్- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రతిపాదనలను స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఫైల్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే- ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ 167 కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021లో ఇదే తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ సాధించిన ప్రాఫిట్ 84 కోట్ల రూపాయలు మాత్రమే.

ఆర్థిక లావాదేవీల్లోనూ అదే దూకుడు..

ఆర్థిక లావాదేవీల్లోనూ అదే దూకుడు..

ఈ మూడు నెలల కాలంలో మొత్తంగా 1,886 కోట్ల రూపాయల మేర లావాదేవీలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇందులోనూ అమరరాజా బ్యాటరీస్ మెరుగైన ఫలితాలను అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,151 కోట్ల రూపాయల మేర లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్‌డౌన్ తరహా పరిస్థితులు, రాజకీయ అనిశ్చితిలోనూ అదరగొట్టే ఫలితాలను అమరరాజా బ్యాటరీస్ అందుకుంది.

 గడ్డు పరిస్థితులు ఉన్నా..

గడ్డు పరిస్థితులు ఉన్నా..

దేశవ్యాప్తంగా వాహనరంగానికి కొంత గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయని, అయినప్పటికీ.. అంచనాలను మించి రాణించిందా కంపెనీ. ఇదే రకమైన దూకుడు ఈ ఏడాది పొడవునా ప్రదర్శిస్తామనే ఆశాభావాన్ని అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గల్లా జయదేవ్ వ్యక్తం చేశారు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ లావాదేవీలు విస్తృతంగా సాగడం వల్ల అమరరాజా బ్యాటరీస్‌కు వాహన తయారీ సంస్థల నుంచి నేరుగా ఆర్డర్లు అందాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

 ఓఈఎం నుంచి భారీ ఆర్డర్లు..

ఓఈఎం నుంచి భారీ ఆర్డర్లు..

ఈ సెక్టార్‌లో అశోక్ లేలాండ్, ఫోర్డ్ ఇండియా, హోండా, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి బిగ్ ఆటోమొబైల్ కంపెనీస్‌తో అమరరాజా నేరుగా లావాదేవీలను కొనసాగిస్తోంది. వారికి బ్యాటరీలను సరఫరా చేస్తోంది. విదేశాలకూ వాటిని ఎగుమతి చేస్తోంది. ఈ సారి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి భారీగా ఆర్డర్లు అందడంతో పాటు ఎగుమతులు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడం వల్ల అమరరాజా బ్యాటరీస్ అంచనాలకు అనుగుణంగా రాణించిం

English summary

Galla Jayadev: అదరగొట్టిన అమరరాజా: తొలి త్రైమాసికంలో లాభాలు డబుల్ | Amara Raja Batteries owned by Galla Jayadev Q1 profit doubles to Rs 167 crore

Amara Raja Batteries Ltd (ARBL) owned by Galla Jayadev on Saturday reported profit before tax of Rs 167 crore in Q1 FY22, nearly double from Rs 84 crore in the same period of previous
Story first published: Saturday, August 14, 2021, 19:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X