For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Carbon Border Tax: కార్బన్ పన్నును వ్యతిరేకిస్తున్న భారత్, చైనా.. ఎందుకంటే..

|

షర్మ్ ఎల్ షేక్‌లో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP) 27వ ఎడిషన్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ కాన్ఫరెన్స్ లో భారత్ తో కూడిన కన్సార్టియం కార్బన్ సరిహద్దు పన్నులను వ్యతిరేకించింది. ఈ నిర్ణయం మార్కెట్ దెబ్బతీనేందుకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కార్బన్ ఇంటెన్సివ్ కలిగిన సిమెంట్, స్టీల్ వంటి ఉత్పత్తులపై పన్ను విధించేందుకు కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం అని పిలువబడే ఒక విధానాన్ని యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించింది.ఈ విధానంలో భాగంగా కార్బన్ సరిహద్దు పన్ని విధిస్తుంది. దీన్ని 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది.

బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా, చైనాతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ దేశాలు బొగ్గుపై ఆధారపడిన పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. కార్బన్ సరిహద్దు పన్నుతో ఈ దేశాలంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఈ దేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ స్పందించడం లేదని కన్సార్టియం "తీవ్ర ఆందోళన" వ్యక్తం చేసింది.

Along with India, China, Brazil, South Africa oppose carbon tax

చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల తయారీదారులు ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ టారిఫ్‌ను ప్రారంభించే ముందు వచ్చే ఏడాది నుండి EU వినియోగదారులకు కార్బన్ ఉద్గారాల డేటాను అందించాల్సి ఉంటుందని యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు చెప్పారు.కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (CBAM) ప్రారంభంలో కనీసం ఐదు పరిశ్రమలు ఉంటాయన్నారు. సిమెంట్, అల్యూమినియం, ఎరువులు, ఉక్కు, విద్యుత్ పై కార్బన్ పన్ను విధిస్తామని పేర్కొన్నారు.

English summary

Carbon Border Tax: కార్బన్ పన్నును వ్యతిరేకిస్తున్న భారత్, చైనా.. ఎందుకంటే.. | Along with India, China, Brazil, South Africa oppose carbon tax

Consortium with India opposes carbon border taxes. Expressed concern that this decision would lead to market damage.
Story first published: Thursday, November 17, 2022, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X