For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా శాలరీ మాకివ్వండి, మేం ఈ ఉద్యోగం చేయలేం: కేంద్రమంత్రికి ఘాటు లేఖ

|

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన పైలట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి ఘాటు లేఖ రాశారు. తమ వేతనాలు సత్వరమే బకాయిలు చెల్లించాలని, ఎలాంటి నోటీసు పీరియడ్ లేకుండా ఉద్యోగాల నుంచి ఉద్యోగాల నుంచి వైదొలిగే సదుపాయం కల్పించాలని కోరారు.

రూ.1200తో ఫేక్ రివ్యూస్: అమెజాన్‌ను, కస్టమర్లకు భలే బురిడీ!రూ.1200తో ఫేక్ రివ్యూస్: అమెజాన్‌ను, కస్టమర్లకు భలే బురిడీ!

మాకు నోటీసు నిబంధనలు వద్దు

మాకు నోటీసు నిబంధనలు వద్దు

ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో 800 మంది పైలట్లు సభ్యులుగా ఉన్న ICPA ఈ ఘాటు లేఖ రాసింది. 2020 మార్చి నాటికి ప్రయివేటీకరించకుంటే మూతబడటమే శరణ్యమని పేర్కొంది. ఎయిరిండియా నుంచి వైదొలిగేందుకు తమకు నోటీసు పీరియడ్ నిబంధన పెట్టవద్దని, తాము బాండెడ్ లేబర్ కాదని తెలిపింది.

వేతన బకాయిలు చెల్లించండి.. పని చేసేందుకు సిద్ధంగా లేం

వేతన బకాయిలు చెల్లించండి.. పని చేసేందుకు సిద్ధంగా లేం

తమకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. తాము పని చేసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేమని పేర్కొంది. గత రెండు మూడేళ్లుగా ఒత్తిడిలో బతుకుతున్నామని, దీని కారణంగా చాలామంది ఉద్యోగులు లోన్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

మూతపడుతుందనే ప్రకటనపై ఆందోళన

మూతపడుతుందనే ప్రకటనపై ఆందోళన

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఎయిరిండియా ప్రయివేటీకరణ జరగపోతే అప్పుడు సంస్థ మూతబడుతుందని చేసిన ప్రకటన ఆందోళనకరమని పేర్కొంది. 21 ప్రయివేటు రంగ విమానయాన సంస్థల ఉద్యోగులకు పట్టిన గతి మాకు వద్దని కోరుకుంటున్నామని తెలిపింది. మాకు ఈ ఉద్యోగాలు వద్దని, మా వేతన బకాయిలు చెల్లిస్తే మేం వెళ్లిపోతామని అంటున్నారు.

ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ప్రస్తుతం రూ.58 వేల కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. దీంతో దీనిని అమ్మేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో స్పందన లేదు. కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సంస్థలోని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary

మా శాలరీ మాకివ్వండి, మేం ఈ ఉద్యోగం చేయలేం: కేంద్రమంత్రికి ఘాటు లేఖ | Allow us to quit without serving notice, clear our dues: Air India pilots to Centre

Flagging concerns over unpaid dues, an Air India pilots' union has urged the government to allow their members to quit the debt laden carrier without serving notice period.
Story first published: Thursday, December 26, 2019, 10:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X