For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC PMVVY Scheme: వృద్ధుల కోసం అదిరిపోయే పథకం తీసుకొచ్చిన కేంద్రం.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

చాలా మంది ఉద్యోగులు, లేదా వ్యాపారాలు చేసే వారు జీవితం చరమంకంలో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుంటారు. సరైన రిటైర్మెంట్ ప్లానింగ్ లేక వృద్ధప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఇప్పటి నుంచి రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్లాన్ చేసుకోలే ఇబ్బంది పడుతున్న వారి కోసం కేంద్రప్రభుత్వం పెన్షన్ ప్లాన్ తీసుకొచ్చింది.

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా

ఈ పథకానికి ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)గా పేరు పెట్టారు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన 2017లో ప్రారంభించారు. ఇది మొదటగా మార్చి 31, 2020 వరకు సభ్యత్వం కోసం అందుబాటులో ఉంది. కానీ ప్రభుత్వం చివరి తేదీని మార్చి 31, 2023 వరకు పొడిగించింది. అయితే ఈ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి LIC లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాకు మాత్రమే అధికారం ఉంది.

అర్హత వయస్సు

అర్హత వయస్సు

ఎన్‌రోల్ చేయడానికి, సీనియర్ సిటిజన్‌లు ఒకేసారి మొత్తం చెల్లించి ప్లాన్‌ని కొనుగోలు చేయాలి. మెచ్యూరిటీ తర్వాత, LIC పెన్షనర్‌కు ప్రీమియంను తిరిగి ఇస్తుంది. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన సభ్యత్వం కోసం మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంది. LIC ప్రకారం, 60 సంవత్సరాలు (పూర్తి), అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు పెన్షన్ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. స్కీమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడానికి గరిష్ట వయోపరిమితి లేదు.

టర్మ్

టర్మ్

ప్రధాన మంత్రి వయ వందన యోజన యొక్క పాలసీ వ్యవధి 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. చందాదారునికి నెలవారీ/త్రైమాసికం/ అర్ధ-సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తారు. కొనుగోలు సమయంలో సబ్‌స్క్రైబర్ దీన్ని ఎంచుకోవాలి. పాలసీ డాక్యుమెంట్ ప్రకారం, కొనుగోలు చేసిన తేదీ నుండి 1 నెల, 3 నెలలు, 6 నెలలు లేదా 1 సంవత్సరం తర్వాత మొదటి పెన్షన్ ప్రారంభమవుతుంది.

PMVVY కనిష్ట, గరిష్ట పెన్షన్

PMVVY కనిష్ట, గరిష్ట పెన్షన్

PMVVY కింద కనీస, గరిష్ట పెన్షన్ పెన్షనర్ కొనుగోలు చేసిన ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. నెలవారీ - రూ. 1,000, త్రైమాసికంగా రూ. 3,000, 6 నెలలకు రూ. 6,000, సంవత్సరానికి రూ. 12,000 కనిష్ఠ పెన్షన్ పొందవచ్చు. గరిష్ఠంగా నెలకు రూ.9,250 పొందవచ్చు. సంవత్సరానికి రూ. 1,11,000 పొందవచ్చు.

రూ. 1,000 నెలవారీ పెన్షన్ కోసం రూ. 1,62,162 ప్రీమియం చెల్లించాలి. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియంను బట్టి పెన్షన్ వస్తుంది.

English summary

LIC PMVVY Scheme: వృద్ధుల కోసం అదిరిపోయే పథకం తీసుకొచ్చిన కేంద్రం.. చివరి తేదీ ఎప్పుడంటే.. | All You Need to Know About Pradhan Mantri Vaya Vandana Yojana

The Pradhan Mantri Vaya Vandana Yojana was launched in 2017. It was initially available for subscription till March 31, 2020.
Story first published: Saturday, August 27, 2022, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X