For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ తృతీయ రోజు స్థిరంగా బంగారం ధరలు, రూ.48,500కు సమీపంలో..

|

బంగారం, వెండి ధరలు నేడు స్వల్ప క్షీణతతో ప్రారంభమై, ఆ తర్వాత కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. తద్వారా నేడు పసిడి వారం రోజుల కనిష్టాన్ని తాకింది. అక్షయ తృతీయ నేపథ్యంలో సాధారణంగా బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతాయి. అయితే గత ఏడాది, ఈ సంవత్సరం అక్షయ తృతీయ కొనుగోళ్లపై కరోనా ప్రభావం ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో బంగారం దుకాణాలకు వెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రజలు కూడా బయటకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు కనీసం గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేసుకుంటారు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.43.00 (0.09%) పెరిగి రూ.47481.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,368.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,491.00 గరిష్టాన్ని, రూ.47,337.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.30.00 (0.06%) పెరిగి రూ.47975.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,889.00 వద్ద ప్రారంభమై, రూ.47,975.00 గరిష్టాన్ని, రూ.47,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,000 దిగువకు వెండి

రూ.71,000 దిగువకు వెండి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.197.00 (0.28%) పెరిగి రూ.70670.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,355.00 వద్ద ప్రారంభమై, రూ.70,683.00 గరిష్టాన్ని, రూ.70,085.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.191.00 (0.27%) పెరిగి రూ.71793.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 ప్రారంభమైన ధర, రూ.71,793.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,250.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను...

అంతర్జాతీయ మార్కెట్లోను...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 1830 డాలర్ల పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 10.35 (0.57%) డాలర్లు పెరిగి 1,834.25 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,819.45 - 1,830.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.264 (0.98%) డాలర్లు పెరిగి 27.328 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.927 - 27.233 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

అక్షయ తృతీయ రోజు స్థిరంగా బంగారం ధరలు, రూ.48,500కు సమీపంలో.. | Akshaya Tritiya 2021: Gold slips marginally, silver below Rs 70,500

Gold bounced off a one-week low hit earlier on Thursday as a dip in U.S. Treasury yields bolstered the metal's appeal as an inflation hedge. Precious metals remained mild, despite India celebrating the auspicious gold buying festival of Akshaya Tritiya.
Story first published: Friday, May 14, 2021, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X