For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు

|

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త. ఔట్ గోయింగ్ కాల్స్ పైన పరిమితి ఎత్తివేస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించాయి. ఇతర నెట్‌వర్క్‌లకు వర్తించే ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్‌పై పరిమితిని తొలగిస్తున్నట్లు తొలుత ఎయిర్‌టెల్ ప్రకటించగా, ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా ఊరట ప్రకటన చేసింది.

కాల్స్ పరిమితి ఎత్తివేత

కాల్స్ పరిమితి ఎత్తివేత

ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ప్రకటించిన ఈ కొత్త పథకాలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ రెండు కంపెనీలు అంతక్రితం ఇతర టెలికం ఆపరేటరుకు చేసే ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్‌పై 28 రోజుల కాలపరిమితి స్కీంకు 1,000 నిమిషాలు, 84 రోజుల కాలపరిమితికి 3,000 నిమిషాలు, 365 రోజుల కాలపరిమితి స్కీంకు 12,000 నిమిషాల చొప్పున పరిమితి విధించారు.

షరతుల్లేవు.. కాల్స్ చేసుకోండి

షరతుల్లేవు.. కాల్స్ చేసుకోండి

ఈ పరిమితి మించితే ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తోంది. అయితే తాజాగా దీనినిపై ఊరట ప్రకటన చేశాయి. 'ఇండియాలో ఏ నెట్ వర్క్‌కు అయినా తమ అన్ని అపరిమిత స్కీంలపై అపరిమిత కాల్స్ పొందండి. ఎలాంటి షరతులు వర్తించవు' అని ఎయిర్ టెల్ ట్వీట్ చేసింది.

అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు

అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు

వొడాఫోన్ ఐడియా కూడా అపరిమిత కాల్స్‌కు శుభవార్త చెప్పింది. ఇతర నెట్ వర్క్‌లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చునని, మార్పులు 6వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని ట్విట్టర్‌లో పేర్కొంది.

మళ్లీ ఉచిత కాల్స్

మళ్లీ ఉచిత కాల్స్

వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ ప్రకటనలు.. సవరణలతో ఉచిత కాల్స్ మళ్లీ వచ్చినట్లుగా అయింది. ఎయిర్ టెల్ అపరిమిత కాల్స్ శనివారం నుంచి, వొడాఫోన్ ఐడియా అపరిమిత కాల్స్ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే పెంచిన ఛార్జీలు మాత్రం అలాగే ఉన్నాయి.

English summary

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు | Airtel, Vodafone Idea remove cap on free outgoing calls to other networks

Telecom operators Bharti Airtel and Vodafone Idea have removed cap from free outgoing calls on other networks under new plans for pre paid customers that came into effect from December 3.
Story first published: Sunday, December 8, 2019, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X