For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటితో సంబంధం లేదు, మార్చి 31 కల్లా ఆ బకాయిలు కట్టాల్సిందే

|

భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI) సంస్థలు మార్చి-2020 చివరి నాటికి తమ ఏజీఆర్ ఛార్జీల్లో పది శాతం మొత్తాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT)కు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న టెల్కోలకు ఇది తలనొప్పిగా మారుతోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని డాట్ చెబుతోంది. ఈ లెక్కన వొడాఫోన్ ఐడయా దాదాపు రూ.5,800 కోట్లకు పైన, ఎయిర్‌టెల్ రూ.4వేల కోట్లకు పైనా చెల్లించాలి. బకాయిల్లో ఇప్పటికే వొడాఫోన్ ఐడియా రూ.7.5 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.18వేల కోట్లు చెల్లించింది.

డాట్ అధికారులు మాత్రం చెల్లించినవి మినహా మిగిలిన వాటిలో పది శాతాన్ని మార్చి 31 వ తేదీ నాటికి చెల్లించాలని అంటున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు కంపెనీలకు ఇచ్చిన వెసులుబాటుపై నిపుణులతో డాట్ సమీక్షించింది. సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, టెల్కోలు చెల్లించిన మొత్తం మినహా, మిగిలిన మొత్తాన్ని వచ్చే మార్చి నుండి క్రమంగా చెల్లించాలని ఆదేశించిందని చెబుతున్నారు. మార్చి నాటికి ఏజీఆర్ బకాయిలు విలువను లెక్కగట్టి వాటిపై 10 శాతం వసూలు చేస్తారు.

2 లక్షలకోట్ల డాలర్లు.. ప్రపంచదిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదలీ కలకలం, షేర్లు 1998 స్థాయికి..2 లక్షలకోట్ల డాలర్లు.. ప్రపంచదిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదలీ కలకలం, షేర్లు 1998 స్థాయికి..

Airtel, VI must pay 10 percent of AGR dues by March 31: DoT

ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీం కోర్టులో గత నెలలో టెల్కోలకు ఊరట లభించిన విషయం తెలిసిందే. అయితే పదిహేను లేదా ఇరవై ఏళ్ల సమయం కోరగా సుప్రీం కోర్టు 10 ఏళ్ల గడువు ఇచ్చింది. అదే సమయంలో డాట్ పేర్కొన్న బకాయిలే తుది గణాంకాలు అని, వీటిపై టెల్కోలు ఎలాంటి అప్పీల్ చేయరాదని, తిరిగి మదింపు చేయడం ఉండదని తేల్చి చెప్పింది.

English summary

వాటితో సంబంధం లేదు, మార్చి 31 కల్లా ఆ బకాయిలు కట్టాల్సిందే | Airtel, VI must pay 10 percent of AGR dues by March 31: DoT

Bharti Airtel and Vodafone Idea are busy dialing their legal teams to interpret what the Supreme Court meant when it said 10 per cent of their adjusted gross revenue (AGR) dues must be paid by March 31, 2021, even as the Department of Telecommunications (DoT) believes there's no ambiguity in the order.
Story first published: Tuesday, September 22, 2020, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X